తెలంగాణ

కేసీఆర్‌వన్నీ మాయమాటలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టేషన్‌ఘన్‌పూర్, ఏప్రిల్ 10: రాష్ట్ర ప్రజలను మాయమాటలతో మోసం చేస్తూ ముఖ్యమంత్రి కేసిఆర్ తన అధికార పబ్బాన్ని గడుపుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో మండల బీజేపీ ఆధ్వర్యంలో దళిత అదాలత్ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ టిఆర్‌ఎస్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ముఖ్యమంత్రి తన మాయమాటలతో రాజకీయ పబ్బాన్ని గడుపుకుంటూ ప్రగతి భవనానికే పరిమితమయ్యారని ఆయన ఆరోపించారు. అంతేకాక నిరుపేద కుటుంబాలకు ఇచ్చిన రెండు పడకగదుల ఇళ్ళ నిర్మాణాల హామీ ఏమైనట్లని ప్రశ్నించారు. దళితులకు మూడెకరాల భూమి, ఉద్యోగ నియామకాలు, తదితర అంశాలపై దళితులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి తన రాజకీయ నాటకాన్ని ప్రదర్శిస్తున్నట్లు అరోపించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రప్రభుత్వం విడుదల చేసిన నిధులను కనీసం దళితుల సంక్షేమానికి ఖర్చు చేయకుండా కాలయాపన చేస్తున్న ఘనుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన వ్యాఖ్యానించారు. ఎస్సీ సబ్‌ప్లాన్ నిధుల్లో కనీసం 40 శాతం కూడా ఖర్చు చేయలేదన్నారు. 50 సంవత్సరాల కాంగ్రెసు పాలనలో చేయలేని అభివృద్ధి పనులను బీజేపీ కేవలం నాలుగు సంవత్సరాల్లోనే చేసి చూపించడం జరిగిందన్నారు. దేశ ప్రజల సమగ్ర అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించడం ప్రాంతీయ పార్టీలకు పరిపాటిగా మారిందన్నారు. తెలంగాణలో బీజేపీ పాగా వేస్తుందనే భయంతోనే ముఖ్యమంత్రి, తన అనుచర మంత్రివర్గం కేంద్రప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని ఆయన అన్నారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా తెలంగాణలో బీజేపీ బలపడుతుందన్నారు. కార్యక్రమంలో వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు పద్మదేవేందర్ పాల్గొన్నారు.

చిత్రం..దళిత అదాలత్ సమావేశంలో మాట్లాడుతున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్