తెలంగాణ

దేశవ్యాప్తంగా వర్క్‌షాప్‌లు నిర్వహించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 10: తెలంగాణ జైళ్ల శాఖ అరుదైన అవకాశాన్ని దక్కించుకుంది. బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ జైళ్ల నిర్వహణపై దేశవ్యాప్తంగా వర్క్‌షాప్‌లు నిర్వహించాల్సిందిగా తెలంగాణ జైళ్ల శాఖను కోరింది. ఇక్కడి జైళ్లలో నిర్వహిస్తున్న విధానాల వల్ల ఖైదీల ప్రవర్తనలో మార్పులు రావడం, జైళ్లలో మరణాల సంఖ్య గణనీయంగా తగ్గడం తదితర విషయాలను పరిగణనలోనికి తీసుకొన్న బీపీఆర్‌డి ఈ మేరకు వర్క్‌షాపులు నిర్వహించాల్సిందిగా ఆహ్వానించినట్టుల జైళ్ల శాఖ డీజీ వీకే.సింగ్ పేర్కొన్నారు. దేశంలోని నాలుగు ప్రధాన నగరాల్లో ఈ వర్క్‌షాపులను నిర్వహించనున్నారు.
ఇందు కోసం ఓ ప్రత్యేక అధికారుల బృందం ఆయా ప్రాంతాల్లోని అధికారులకు పలు విషయాలపై అవగాహన కల్పించనుంది. రాష్ట్ర ఏర్పాటు అనంతరం జైళ్ల శాఖలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం, ఖైదీల ఆరోగ్యం కోసం ప్రత్యేక వసతులు కల్పించడం వంటి కారణాల వల్లే ఈ అవకాశం వచ్చినట్టు అధికారులు పేర్కొంటున్నారు.