తెలంగాణ

ప్రైవేట్ క్రిస్టియన్ మైనార్టీ డిగ్రీ కాలేజీలు అడ్మిషన్లను సొంతంగా నిర్వహించుకోవచ్చు: హైకోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 19: తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ క్రిస్టియన్ మైనార్టీ డిగ్రీ కాలేజీల యాజమాన్యం ప్రభుత్వ నోటిఫికేషన్‌తో సంబం ధం లేకుండా ఆన్‌లైన్ ద్వారా అడ్మిషన్లు జరుపుకోవచ్చని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి నవీన్‌రావు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రప్రభుత్వం మే 20వ తేదీ నుంచి ఆన్‌లైన్ అడ్మిషన్లు జరపాలంటూ జారీ చేసిన ఆదేశాలను సవాలు చేస్తూ రాజధానిలో సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీ ఫర్ వుమెన్‌తో పాటు మరో 11 కాలేజీలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఈ కేసులో పిటిషనర్ల తరఫున ఎస్ శ్రీరాం అనే న్యాయవాది వాదనలు వినిపించారు. ఆన్‌లైన్ సెంట్రలైజ్డ్ విధానం ద్వారా ఈ కాలేజీలు మెరిట్ ప్రాతిపదికన కౌనె్సలింగ్ నిర్వహిస్తాయన్నారు. యూనివర్శిటీ నిర్ణయించిన ఫీజులను వసూలు చేస్తాయని ఆయన హైకోర్టుకు విన్నవించారు.