తెలంగాణ

రైతుబంధు చెక్కుల పరిశీలన షురూ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 12: రైతుబంధు పథకంలో కీలకమైన తొలిదశ చెక్కుల పరిశీలన గురువారం ఇక్కడ ప్రారంభమైంది. నిర్ణీత ప్రణాళిక మేరకు రైతుబంధు పథకం కొనసాగుతోంది. ప్రభుత్వం బ్యాంకులకు అందచేసిన గ్రామాలు, రైతుల వివరాలకు అనుగుణంగా చెక్కుల ముద్రణ ప్రథమదశ పూర్తయింది. ఎస్‌బిఐ, ఆంధ్రాబ్యాంక్, సిండికేట్ బ్యాంక్, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్, కెనరాబ్యాంక్, ఏపీ గ్రామీణవికాస్ బ్యాంక్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకులు నిర్దేశించిన ప్రాంతాల్లో/్భవనాల్లో తొలివిడత చెక్కుల వెరిఫికేషన్ జరిగింది. జిల్లా వ్యవసాయ అధికారులు, సహాయ వ్యవసాయ అధికారులు, వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణాధికారులు వెరిఫికేషన్‌లో పాల్గొన్నారు. ఆ యా బ్యాంకుల తరఫున సంబంధిత బ్యాంకుల జనరల్ మేనేజర్లు పర్యవేక్షించారు. గురువారం ప్రారంభమైన తొలిదశ చెక్కుల వెరికేషన్ మరో రెండురోజులపాటు కొనసాగుతుంది. వెరికేషన్ తర్వాత తొలిదశ చెక్కులను (మూడోవంతు) జిల్లాలకు పంపించే అంశంపై చర్చించేందుకు హైదరాబాద్ (నాంపల్లిలోని హార్టికల్చర్ ట్రైనింగ్ సెంటర్ (హెచ్‌టిసి) లో ప్రత్యేక సమావేశం ఏర్పాటైంది. మార్గదర్శకాలను వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి. పార్థసారథి ఈ సందర్భంగా వెల్లడించారు. వ్యవసాయ కమిషనర్ డాక్టర్ ఎం. జగన్‌మోహన్‌తో సహా ఈ పథకానికి సంబంధించిన వివిధశాఖల అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.