తెలంగాణ

బ్రాహ్మణులెవరూ ఆందోళన చెందొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 10: తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ రూపొందించిన వివిధ పథకాల ద్వారా సాయం కోసం ఎదరు చూస్తున్న బ్రాహ్మణులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈ పరిషత్ విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్ (బొగ్గులకుంట) లోని ధార్మిక భవన్‌లో మంగళవారం జరిగిన తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు ఒక తీర్మానాన్ని ఆమోదించారు. సంక్షేమ పరిషత్ చైర్మన్ డాక్టర్ కె వి రమణాచారి అధ్యక్షతన ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైన సమావేశం సుదీర్ఘంగా వివిధ అంశాలపై చర్చలు జరిపింది.
ప్రభుత్వం ఇప్పటికే ఆమోదించిన మూడు పథకాల్లో ముఖ్యమైన వివేకానంద విదేశీ విద్యా పథకంలో ఎంపికైన వారందరికీ ఆన్‌లైన్ ద్వారా త్వరలో చెల్లింపు చేయాలని సమావేశంలో తీర్మానించారు. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ పథకాలన్నింటికీ ఆమోదం లభించేలా పరిషత్ కార్యవర్గం నిబద్ధతతో కృషి చేస్తున్నందువల్ల ఈ విషయంలో బ్రాహ్మణ సంఘాలు, బ్రాహ్మణులెవరూ ఆందోళన చెందొద్దని సమావేశం విజ్ఞప్తి చేసింది. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అధ్యక్షులు కేవీ రమణాచారి నేతృత్వంలో సభ్యులంతా కలిసి త్వరలో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావును కలిసి పరిషత్ పథకాలను, వాటి ప్రాధాన్యతలను వివరించాలని సర్వసభ్య సమావేశం నిర్ణయించింది.

చిత్రం..తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సర్వసభ్య సమావేశంలో
మాట్లాడుతున్న పరిషత్ చైర్మన్ డాక్టర్ కె వి రమణాచారి