తెలంగాణ

పత్తి విత్తనాలపై నిరంతర నిఘా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 10: రాష్ట్రంలోని పత్తి రైతులను నకిలీ పత్తి విత్తనాలు, ప్రభుత్వ అనుమతి లేని విత్తనాల ఉత్పత్తిదారుల నుంచి రక్షించడం కోసం ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి. పార్థసారథి నేతృత్వంలో సచివాలయంలో మంగళవారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ అంశంపై కూలంకుషంగా చర్చించారు. పార్థసారథి ఆదేశాల మేరకు రాష్టవ్య్రాప్తంగా ఏర్పాటైన 50 టాస్క్ఫోర్స్ కమిటీల పనితీరుపై చర్చించారు.
టాస్క్ఫోర్స్ కమిటీలు 2018 మార్చి 29 నుండి ఏప్రిల్ 9 వరకు వేర్వేరు జిల్లాల్లోని విత్తన ప్రాసెసింగ్ ప్లాంట్లు, గోదాములతో సహా 1860 విత్తనాల దుకాణాలను పరిశీలించాయి. టాస్క్ఫోర్స్ కమిటీలు చేసిన దాడులు, పరిశీలనల సందర్భంగా 3.32 కోట్ల విలువైన 4253 కిలోల గడవుమీరిన పత్తివిత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. 9.83 కోట్ల రూపాయల విలువైన 6312 కిలోల నాసిరకం విత్తనాలతో పాటు కేంద్ర ప్రభుత్వ (జెనెటికల్లీ ఇంజనీరింగ్ అప్రువల్ కమిటీ-జీఈఏసీ) అనుమతి లేని హెర్బిసైడ్ టాలరెంట్ (హెచ్‌టి) పత్తివిత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా 31 మందిని అరెస్ట్ చేసి ఆరుగురిపై ఐపీసీ 420 కింద కేసు నమోదు చేశారు. అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై నర్మదాసాగర్, కీర్తియన్ అగ్రిజెనెటిక్స్, కోహినూర్ సీడ్స్, విభ అగ్రోటిక్ కంపెనీలకు షోకాజ్ నోటీసులను జారీ చేశారు.
ఈ సందర్భంగా పార్థసారథితో పాటు ఐజీపీ నాగిరెడ్డి మాట్లాడుతూ, నాణ్యతలేని, నాసిరకం విత్తనాలతో పాటు అనుమతిలేని పత్తివిత్తనాలను అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరిస్థితిని అనుసరించి పీడీ యాక్ట్‌ను కూడా పెడతామని హెచ్చరించారు. పత్తిరైతులకు అండగా ఉండేందుకే టాస్క్ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేశామని, నిరంతరం తనిఖీలు చేస్తామని ప్రకటించారు. ఈ కమిటీలు ఎప్పటికప్పుడు తమకు నివేదికలను అందచేయాలని ఆదేశించారు.ఈ సమావేశంలో వ్యవసాయ కమిషనర్ డాక్టర్ ఎం. జగన్‌మోహన్, విత్తన ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ కె. కేశవులు, ఉద్యాన శాఖ కమిషనర్ ఎల్. వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు.

చిత్రం..సచివాలయంలో మంగళవారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో మాట్లాడుతున్న వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి. పార్థసారథి