తెలంగాణ

బీసీ విద్యార్థులకూ పూర్తి ఫీజు రీయంబర్స్ చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 12: తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు మాదిరిగా బీసీ విద్యార్థులకూ పూర్తి ఫీజు రీయంబర్స్‌మెంట్ చెల్లించాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. గురువారం బీసీ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. దళిత, గిరిజనుల పట్ల ఒకలాగా బీసీల పట్ల ఒకలా వ్యవహరించడం సరికాదని అన్నారు. పది వేలలోపు ర్యాంకు సాధించిన వారికే ఫీజు రీయంబర్స్‌మెంట్, ఇతర రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న వారికి ఫీజు చెల్లించక పోవడంతో పేద బీసీ విద్యార్థులు విద్యకు దూరం అయ్యే ప్రమాదం ఉందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వివక్షత ప్రదర్శించకుండా బీసీ విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు.