తెలంగాణ

కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 13: గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో పని చేస్తున్న 40 వేల మంది కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. పంచాయతీల్లో పని చేస్తున్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కొంత మంది శుక్రవారం ఆర్.కృష్ణయ్యను కలిసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ మేరకు స్పందించిన ఆర్.కృష్ణయ్య వెంటనే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు లేఖ రాశారు. కర్నాటక ప్రభుత్వం తరహాలో రెగ్యులరైజ్ చేసి ప్రభుత్వ గ్రాంట్ ద్వారా కనీస వేతనాలు ఇవ్వాలని ఆ లేఖలో ముఖ్యమంత్రిని కోరారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. జివో నెం. 14 ప్రకారం జీతాలు చెల్లించాలని ఆయన కోరారు. గ్రామ పంచాయతీ సిబ్బంది ఉద్యోగ భద్రత కల్పించేలా అసెంబ్లీలో చట్టం చేయాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు. 1988 నుంచి 2001 పంచాయతీ కార్యదర్శుల వ్యవస్థ వచ్చిన నాటి వరకు ఫిక్స్‌డు వేతనంపై పని చేస్తున్న కారోబార్, బిల్లు కలెక్టర్స్‌కు తదితర క్యాటగిరిల ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి పంచాయతీ కార్యదర్శులుగా నియమించేందుకు చర్యలు చేపట్టాలని కృష్ణయ్య ముఖ్యమంత్రిని కోరారు.