తెలంగాణ

అక్రమంగా ఇసుక నిల్వ చేసిన వారిపై పీడీ యాక్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిమ్మాపూర్, ఏప్రిల్ 13: మోయ తుమ్మెద వాగు పరిధిలో అక్రమంగా ఇసుకను నిల్వ చేసిన వారిపై పీడీ యాక్ట్ పెడతామని లోయర్ మానేర్ డ్యామ్ (ఎల్‌ఎండి) సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కరుణాకర్ రావు హెచ్చరించారు. మండలంలోని ఎల్‌ఎండి కాలనీలోగల సీఐ కార్యాలయంలో శుక్రవారం విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఐ కరుణాకర్ రావు, ఎస్సై నరేష్‌రెడ్డి మాట్లాడుతూ ఈ సంవత్సరం జనవరి నుండి ఇప్పటి వరకు తిమ్మాపూర్, గనే్నరువరం మండలాలలో 16 ఇసుక డంపులను స్వాదీనం చేసుకున్నట్లు చెప్పారు. 52లారీలు, 12ట్రాక్టర్లను సీజ్ చేసి, ఇసుకను మైనింగ్ అధికారులకు అప్పగించినట్లు వివరించారు. పట్టుకున్న ఇసుక విలువ దాదాపు 20లక్షలు ఉంటుందన్నారు. మోయతుమ్మెద వాగు నుండి అక్రమంగా ఇసుకను తరలించిన వారిపై, ఇసుక డంపులు నిర్వహించిన వారిపై, భూమి యాజమానిపై కూడా క్రిమినల్ కేసులు పెడతామన్నారు. భూమి, ట్రాక్టర్, జేసీపి, లారీ, డంపు నిర్వాణకులు, డ్రైవర్లు, యాజమానులపై కూడా కేసు పెడతామన్నారు.
అలాగే మూడు సార్లు పట్టుబడిన వారిపై 397,302 చట్టం క్రింద పీడీ యాక్ట్ పెట్టి కోర్టులో హాజరు పరుస్తామని, దానికి సంవత్సరం వరకు బేల్ దొరకదని చెప్పారు. ప్రభుత్వ, గ్రామాభివృద్ధి కోసం పరిమిషన్‌తో కూడిన ఇసుక ట్రాక్టర్లను మాత్రమే వదిలేస్తామని, అదీ రాత్రి పూట తప్ప దినంలోనే నడుపుకోవాలని సూచించారు. చట్టాన్ని అతిక్రమిస్తే అలాంటి వారిపైనా పీడీ యాక్ట్ పెట్టడంలో వెనుకాడబోమని హెచ్చరించారు.