తెలంగాణ

మేడ్చల్ కలెక్టర్‌కు సర్వే క్షమాపణ చెప్పాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 15: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ వెంటనే మేడ్చల్ కలెక్టర్, రెవిన్యూ ఉద్యోగులకు క్షమాపణ చెప్పాలని టీఆర్‌ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. మెట్రోరైలు బాలానగర్ స్టేషన్‌కు అంబేద్కర్ నామకరణ కార్యక్రమం సందర్భంగా మేడ్చల్ కలెక్టర్ ఎంవి రెడ్డిని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ దూషించడంతో పాటు రెవిన్యూ ఉద్యోగిపై దాడి చేసిన సంఘటనను టీఆర్‌ఎస్ తీవ్రంగా ఖండించింది. టీఆర్‌ఎస్ శాసనసభా పక్షం కార్యాలయంలో ఆదివారం ఎమ్మెల్యే నోముల వీరేశంతో కలిసి ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. గతంలో కూడా సర్వే సత్యనారాయణ రాజ్‌భవన్‌లో గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ పట్ల అనుచితంగా ప్రవర్తించారని వారు గుర్తు చేశారు. మాజీ ఎంపీ అని గౌరవించి కార్యక్రమానికి ఆహ్వానిస్తే కలక్టర్‌పైనే ఆయన చిందులు వేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అధికారం లోకి వచ్చే అవకాశం లేదని గ్రహించే ఆ పార్టీ నేతలు అసహనంతో ప్రవర్తిస్తున్నారని కర్నే ప్రభాకర్ ధ్వజమెత్తారు. మంత్రులు జూపల్లి కృష్ణారావు, జగదీశ్‌రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని వారు మండిపడ్డారు. తెలంగాణలో ఇసుక విధానం బాగుందని పంజాబ్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు, మంత్రి సిద్దూ ప్రశంసించగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులేమో ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందని కర్నే దుయ్యబట్టారు.