తెలంగాణ

ఉన్నావో, ఖతువా ఘటనలకు బాధ్యులైన వారిని శిక్షించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 15: ఉత్తర్ ప్రదేశ్‌లోని ఉన్నావో ఉదంతం, జమ్మూలోని ఖతువాలో అసిఫాపై జరిగిన అత్యాచార ఘటనలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని 10 వామపక్షాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ దుర్మార్గమైన ఘటనలను కూడా మత రాజకీయాలకు వాడుకోవడం సిగ్గు చేటని సీపీఐ, సీపీఎం, సీపీఐ (ఎంఎల్-ఎస్‌డి), సీపీఐ (ఎంఎల్), ఎంసీపీఐ, ఆర్‌ఎస్‌పీ, ఎఐఎఫ్‌బీ, ఎస్‌యుసీఐ(సీ) పార్టీల నేతలు విమర్శించినట్లు ఆదివారం ఎస్‌యుసీఐ(సి) రాష్ట్ర కార్యదర్శి సి.హెచ్. మురహరి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని ఉన్నావోలో బీజేపీ ఎమ్మెల్యే ఒక అమ్మాయిపై అత్యాచారం చేయడమే కాకుండా, ఈ ఘాతుకం గురించి ఫిర్యాదు చేసిన బాధితురాలి తండ్రిని అరెస్టు చేసి, లాకప్‌లో వేసి దారుణంగా చంపేసిన ఉదంతం వెలుగులోకి వచ్చిందని ఆయన తెలిపారు. జమ్మూలోని ఖతువా ప్రాంతంలో ఎనిమిది సంవత్సరాల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, కిరాతకంగా చంపేసిన ఘటనతో ప్రపంచమే సిగ్గుతో తలదించుకోవాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. ఈ కిరాతక ఘటనలో నిందితులను అరెస్టు చేయకుండా స్థానిక న్యాయవాదుల సంఘం విచారణకు అడ్డుకోవడం, నిందితులను అరెస్టు చేయకుండా అక్కడి హిందూ ఏక్తా మంచ్, స్థానిక బిజెపి రాష్ట్ర కార్యదర్శి ఐదు వేల మందితో వీధుల్లో ఊరేగింపులు నిర్వహించడం దేశ ప్రజలను నివ్వెరపరిచిందని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ రెండు ఘటనల్లో దోషులను కఠినంగా శిక్షించి బాధితులకు న్యాయం చేయాలని వామపక్షాల నేతలు డిమాండ్ చేశారు.