తెలంగాణ

రైతుల సమస్యలపై తీసిన సినిమాకు అడ్డంకులు సిగ్గుచేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 15: దేశంలోని రైతాంగ సమస్యలపై ఆర్.నారాయణ మూర్తి నిర్మించిన ‘అన్నదాత సుఖీభవ’ సినిమాకు అడ్డంకులు సృష్టించడం సిగ్గుచేటని సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. ఆదివారం మఖ్దూంభవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో గోవర్దన్, నర్సింగ్ రావు, విమలక్క, రామాదేవి, రవిచందర్, సజయ తదితరులతో కలిసి ఆయన మాట్లాడారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్‌టీ వల్ల అన్నదాతలు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారన్న విషయలను వివరిస్తూ సినిమా నిర్మించడమే తప్పా అని ప్రశ్నించారు. స్వేచ్ఛగా పనిచేయాల్సిన సెన్సార్‌బోర్డు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయడం సరికాదని అన్నారు. సెన్సార్ బోర్డు తీరు వల్ల సామాజిక ధృక్పథం కలిగిన వారి సినిమాలు ప్రదర్శించే అవకాశం లేకుండా పోయిందని అన్నారు. వేల కోట్లు అప్పులు ఎగ్గొటిన కార్పొరేట్ సంస్థలకు అండగా ఉంటున్న మోడీ ప్రభుత్వం రైతుల రుణాలను మాఫీ చేసేందుకు మాత్రం ముందుకు రావడం లేదని దుయ్యబట్టారు. శామ్ బెనగల్ కమిటీ సెన్సార్ బోర్డు తన పరిధికి లోబడి అన్ని సినిమాలకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని, కేవలం ఆయా సినిమాలను బట్టి వాటికి కేటగిరీలను ఇవ్వడమే బోర్డు పని అని వివరించిందని గుర్తు చేశారు. దానికి విరుద్ధంగా వ్యవహరించడం వల్ల సమాజానికి ఉపయుక్తమైన సినిమాలు ప్రదర్శనకు నోచుకోకుండా పోతున్నాయిని ఆందోళన వ్యక్తం చేశారు. బేషరతుగా బోర్డు ప్రదర్శనకు అనుమతించక పోతే దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.