తెలంగాణ

అన్ని మున్సిపాలిటీల్లో త్వరలో డిజిటల్ డోర్ నంబర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 15: తెలంగాణలోని అన్ని మున్సిపాలిటీల్లో ఇళ్లకు డిజిటల్ డోర్ నంబర్లను ఇచ్చే వినూత్న విధానానికి రాష్ట్ర మున్సిపల్ మంత్రిత్వ శాఖ త్వరలో శ్రీకారం చుట్టనుంది. ఈ దిశగా ఒక సమగ్ర ప్రణాళికను కూడా రూపొందించారు. ఆస్తుల గుర్తింపునకు శాటిలైట్ ఇమేజరీ ఆఫ్ ప్రాపర్టీస్ అండ్ జియో ట్యాగింగ్ విధానాన్ని రాష్ట్ర మున్సిపల్ శాఖ విజయవంతంగా పూర్తి చేసింది. ప్రస్తుతం హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలో 72 మున్సిపాలిటీలు ఉన్నాయి. రాష్ట్రంలో 40 శాతం జనాభా నగరాల్లో నివసిస్తోంది. కాని ఇళ్లకు నంబర్లు లేనందువల్ల గందరగోళం నెలకొంటోంది. ఈ గందరగోళానికి చెక్ పెట్టేందుకు ప్రతి ఇంటికి ఒక విశిష్ట నంబర్‌ను ఇచ్చే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. శాటిలైట్ ఇమేజరీ ద్వారా డిజిటల్ డోర్ నంబరింగ్ ఇస్తారు. రోడ్లు, బైలైన్లు, ఖాళీ ప్లాట్లు, మురికివాడలు, ఇండ్ల వివరాలను మున్సిపల్ శాఖ సేకరించింది. అవసరమైతే సర్వే చేసి డోర్ నంబర్లు ఇస్తారు. పది డిజిట్ల డోర్ నంబర్‌ను ఇచ్చేందుకు విధి విధానాలను త్వరలో ఖరారు చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీ, జియో స్పాటియల్ టెక్నాలజీని వినియోగించనున్నారు. విద్యుత్ కనెక్షన్లు, వాటర్ సప్లై, పన్నుల చెల్లింపులు తదితర వివరాలను కూడా సేకరించి విశిష్ట డోర్ నంబర్‌ను ఖరారు చేస్తారు. మొబైల్ అప్లికేషన్ ద్వారా ఈ వివరాలు ప్రజలకు అందుబాటులోకి తెచ్చే విధంగా ప్రణాళికను ఖరారు చేస్తారు. సూర్యాపేటలోని శ్రీరాంనగర్‌లో ప్రయోగాత్మకంగా డిజిటల్ డోర్ నంబరింగ్‌పై ప్రాజెక్టును అమలు చేశారు. మంచి ఫలితాలు వచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. డిజిటల్ డోర్ నంబర్‌లో డోర్ నంబర్, వీధి, బిల్డింగ్ తదితర వివరాలు ఉంటాయి.