తెలంగాణ

బహుజన లెఫ్ట్ ఫ్రంట్‌తో కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 15: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బహుజన లెఫ్ట్ ఫ్రంట్‌తో కలిసి పోటీ చేయాలని ఎంసిపిఐ(యు) నిర్ణయించింది. ఈ నెల 13న ప్రారంభమైన ఎంసిపిఐ(యు) కీలక మహా సభలు ఆదివారంతో ముగిశాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో కేరళ రాష్ట్రంలో పార్టీ కేంద్ర కమిటీ 4వ జాతీయ సమావేశాలు నిర్వహించాలని కేంద్ర కమిటీ నిర్ణయించింది.
ఇలాఉండగా మహా సభలు ముగిసిన అనంతరం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఎం. అశోక్ ‘ఆంధ్రభూమి ప్రతినిధి’తో మాట్లాడుతూ సీపీఎం, ఎంసీపీఐ, ఆర్‌ఎస్‌పీ, ఎంబీటీ, బీఎస్‌పీలతో ఇటీవల ‘బహుజన లెఫ్ట్ ఫ్రంట్’ ఏర్పాటైనట్లు చెప్పారు. ఈ ఫ్రంట్ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ, టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా తమ ఫ్రంట్ పోటీ చేస్తుందన్నారు.
టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఏర్పాటు చేయాలనుకుంటున్న ఫెడరల్ ఫ్రంట్ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని తమ పార్టీ సమావేశాల్లో భావించామని అశోక్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నిలుపుకోలేదని ఆయన విమర్శించారు. బంగారు తెలంగాణ చేస్తామని ప్రకటించి, బంగారు కుటుంబ పాలనగా మార్చేసుకున్నారని ఆయన విమర్శించారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే దళితుడిని ముఖ్యమంత్రిగా చేస్తామని హామీ ఇచ్చి దళితులను మోసగించారని ఆయన విమర్శించారు. తమ ఫ్రంట్ అధికారంలోకి వస్తే బీసీలకు రాజ్యాధికారం అప్పగిస్తామని ఆయన తెలిపారు. ప్రైవేటు యూనివర్సిటీల బిల్లును తీసుకుని రావడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. కేజీ టు పీజీ ఉచిత విద్య అని ఇచ్చిన హామీ ఏమైందని ఆయన ప్రవ్నించారు. హామీలు ఇవ్వడం వాటిని నిలబెట్టుకోకపోవడంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకరిని మించిన వారు ఒకరని ఆయన విమర్శించారు. ఎంసీపీఐ మాజీ ఎమ్మెల్యే, దివంగత ఎం. ఓంకార్ ఆశయాలకు అనుగుణంగా తాము పని చేస్తున్నామని అశోక్ తెలిపారు. ఈ నెల 13 నుంచి మూడు రోజుల పాటు బాగ్‌లింగంపల్లిలోని ఓంకార్ భవన్‌లో ఎంసిపిఐ(యు) సమావేశాల్లో పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి ఎం.గౌస్ ప్రసంగిస్తూ కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక విధానాలతో దేశంలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం-దుష్ప్రరిణామాలను ఎండగట్టారు.
ఇంకా పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు వికె చౌదరి, తాండ్ర కుమార్, దాసు శాస్ర్తీ, జి. రవి, వల్లెపు కృష్ణమాల్, లీలా శర్మ, కె. సుకన్య, రవి కుమార్, రవి, సాంబయ్య, వరికుప్పల వెంకన్న, ఎల్. శ్రీనివాస్ రెడ్డి, టి. శివయ్య, రాజదాస్, మోహన్‌లాల్, షాజహాన్, రవీందర్, విజయ్‌శంకర్ ఝూ తదితరులు పాల్గొన్నారు.