తెలంగాణ

‘సమాజానికి రామకృష్ణ దూత్ మార్గదర్శకుడు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ, ఏప్రిల్ 15: సమాజానికి రామకృష్ణ దూత్ మార్గదర్శకుడని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి డా.సాంబిత్ పాత్ర అన్నారు. రాజస్థానీ గ్రాడ్యుయేట్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో రామకృష్ణ దూత్ 32వ సంస్మరణ సభ ఆదివారం నాంపల్లి ఎగ్జిమిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి సాంబిత్ పాత్ర పాల్గొని రామకృష్ణ దూత్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళు అర్పించారు. రాజస్థానీలు దేశవ్యాప్తంగా ఉన్నారని తెలిపారు. 70 సంవత్సరాలుగా భారతదేశం అభివృద్ధికి నోచుకోలేదని, చిన్న, చిన్న దేశాలు కూడా ఎంతో అభివృద్ధి చెందాయని పేర్కొన్నారు. స్వాతంత్య్రం ఏర్పాడి 70 సంత్సరాలు గడిచినప్పటికీ పేద ప్రజలకు బ్యాంక్ అకౌంట్ కూడా లేదని, కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి ఒక్కరూ ధన్‌జన్ పథకంతో బ్యాంక్ అకౌంట్స్ తెరిచారని తెలిపారు. నరేంద్ర మోదీ నాలుగు సంవత్సరాల కాలంలో ఆరు కోట్ల కుంటుంబాలకు గ్యాస్ కనెక్షన్లను ఇచ్చారని చెప్పారు. డిజిటల్ ఇండియా పథకంతో రెండు 2లక్షల గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యాలు కల్పించామని పేర్కొన్నారు. నోట్ల రద్దు, జీఎస్‌టీతో దేశ వ్యాప్తంగా 88వేల కోట్ల అవినీతి ఆరికట్టామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుంటుంబ పాలనలకు స్వస్తి పలకాలని చెప్పారు. 10 గంటల వరకు నిద్ర లేవని రాహుల్ గాంధీ.. దేశాన్ని ఏవిధంగా పరిపాలిస్తారని ఎద్దేవా చేశారు. అంబేద్కర్ కేవలం దళిత నేత కాదని, విశ్వానికే నేత అని కీర్తించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన త్రిబుల్ తలాక్ చట్టానికి ఎంఐఎం ఎందుకు మద్దతు ఇవ్వాకుండా వ్యతిరేకించిందని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం.. ముస్లింల మనోభావాలను దెబ్బతీస్తుందని విమర్శలు చేశారని తెలిపారు. రామమందిరం నిర్మాణంలో ఎంఐఎం అడ్డుపడి హిందువుల మనోభావాలను ఎందుకు దెబ్బతీస్తుందని ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని బలపరచాలని కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు గోవింద్ రాఠీ, కార్యదర్శి వినోద్, కోఆర్డినేటర్ ఆనంద్ శర్మ, కన్వీనర్ భగ్‌వన్ దాస్ పాల్గొన్నారు.

చిత్రం..రామకృష్ణ దూత్ 32వ సంస్మరణ సభను జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించిన
బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి డా.సాంబిత్ పాత్ర