తెలంగాణ

మిషన్ భగీరథ పేరుతో కాలయాపన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, ఏప్రిల్ 16: సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండానే జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని అర్ధాంతరంగా ముగించడంతో సభ్యులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసారు. మండు వేసవిలో ప్రజల గొంతెండుతుంటే ప్రభు త్వం, అధికార యంత్రాంగం మాత్రం మిషన్ భగీరథ పేరుతో కాలయాపన చేస్తున్నారంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ సభ్యులు నిలదీయడంతో అధికార, ప్రతిపక్ష పార్టీ సభ్యుల మధ్య వాగ్వాదం నెలకొంది. సోమవారం ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం చైర్ పర్సన్ రాజమణి మురళీధర్ యాదవ్ అధ్యక్షతన కొనసాగింది. ఈ సందర్భంగా సభాధ్యక్షులు, అధికారులను సదాశివపేట జడ్పీటీసీ సభ్యుడు సంగమేశ్వర్ మంచినీటి సమస్యను లేవనెత్తి ఇరకాటంలో పెట్టడంతో అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు మధ్యలో కల్పించుకోవడంతో సమాధానాలు అధికారులు చెప్పాలని మీరు కాదంటూ కాంగ్రెస్ సభ్యులు తిప్పికొట్టారు. సభలో సభ్యులుగా ప్రజాసమస్యలపై అధికారులను ప్రశ్నించే హక్కు ఉందని, అందు కు అధికారులు సమాధానం చెప్పాల్సి ఉండగా మధ్యలో మీరెందుకు అభ్యంతరం చెబుతున్నారని, మమ్మల్నీ ప్రశ్నించే హక్కు మీకెక్కడిదని సంగమేశ్వర్ ఎదురుదాడికి దిగడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. గొర్రెల యూనిట్ల పంపిణీలో అవినీతి చోటు చేసుకుందని, ఈ విషయంలో సమాధానం చెప్పాలని పటాన్‌చెరు టీడీపీ జడ్పీటీసీ సభ్యుడు శ్రీకాంత్ గౌడ్ పట్టుబట్టగా అప్పటికే సమయం 4.30 గంటలు కావడంతో సమావేశాన్ని ముగించడంతో కాంగ్రెస్, టీడీపీ సభ్యులు మండిపడ్డారు. అభివృద్ధిలో వెనుకబడిన నారాయణఖేడ్ నియోజకవర్గం మంజీరా పరీవాహక ప్రాంతంలో ఉందని, మంజీరా నీటిని ఎప్పుడు సరఫరా చేస్తారని ఖేడ్ ఎంపీపీ అధ్యక్షుడు సంజీవరెడ్డి ప్రశ్నించారు. సింగూర్ ప్రాజెక్టులో ఉన్న నీటిని కాపాడకుండా దిగువకు తరలించుకుపోయి ఈ జిల్లాను దుర్భర స్థితిలోకి తీసుకువచ్చారని ధ్వజమెత్తారు. పారిశ్రామిక జిల్లాగా పేరున్న కాలుష్యంతో ప్రజలు అనేక అవస్థలకు గురవుతున్నారని, యాజమాన్యాలతో లాలూచిపడి అధికారులు పట్టించుకోవడం లేదని పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, సభ్యులు శ్రీకాంత్‌గౌడ్, ప్రభాకర్‌గౌడ్ కాలుష్య నివారణ శాఖ అధికారులను నిలదీసారు. కాగా ప్రభుత్వం ఇచ్చిన హామీల ను విస్మరించడాన్ని నిరసిస్తూ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి జడ్పీ సమావేశం ముట్టడి కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేసారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మూడు విడతలుగా జడ్పీని ముట్టడించే ప్రయత్నం చేయగా డీఎస్పీ శ్రీనివాస్‌కుమార్ నేతృత్వంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఆందోళనకారులను అరెస్టు చేసారు. జగ్గారెడ్డి తన అనుచరులతో కలిసి ఆర్టీసి బస్సులో జడ్పీ కార్యాలయానికి చేరుకోగా పోలీసులు వెంటనే అరెస్టు చేసి కొండాపూర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కాగా ఇటీవల కాలంలో నిర్వహిస్తున్న జడ్పీ సమావేశానికి మంత్రి రాకపోవడంతో ప్రతిపక్ష పార్టీ ప్రజాప్రతినిధులతో పాటు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కూడా పెదవి విరుస్తున్నారు. సభ్యుల ప్రశ్నలకు సరియైన సమాధానం లేకపోవడంతో ప్రజా సమస్యలు అపరిష్కృతంగా ఉంటున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది.