తెలంగాణ

మక్కా పేలుళ్ల కేసు న్యాయం జరగలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 16: మక్కామసీదు బాంబు పేలుళ్ల కేసులో న్యాయం జరగలేదని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. పేలుళ్లపై నాంపల్లి ఎన్‌ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పు అనంతరం అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా 2014 నుంచి ఎన్‌ఐఏ సరిగ్గా దర్యాప్తు చేయలేదని అన్నారు. సాక్ష్యాధారాలు, దర్యాప్తు సరిగ్గా చేపట్టకపోతే కోర్టు ఏం చేస్తుందని అన్నారు. 2014లో బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఏ అధికారం చేపట్టిన తర్వాత ఎన్‌ఐఏ నిష్పాక్షికంగా వ్యవహరించడం లేదని ఆయన విమర్శించారు.
తీర్పును స్వాగతించిన దత్తాత్రేయ, లక్ష్మణ్
ఎన్‌ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పును మాజీ కేంద్ర మంత్రి, పార్లమెంట్ సభ్యుడు బండారు దత్తాత్రేయ, తెలంగాణ బిజెపి అధ్యక్షుడు లక్ష్మణ్ స్వాగతించారు. కాంగ్రెస్-యుపిఏ పాలనలో కాషాయ తీవ్రవాదం అంటూ చేసిన అభూతకల్పన ప్రచారానికి ఈ తీర్పు చెంపపెట్టు అని దత్తాత్రేయ అన్నారు. హిందూ సమాజాన్ని వ్యతిరేకించే కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలకు ఈ తీర్పు చెంప పెట్టులాంటిదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అమాయకులను ఈ కేసులో ఇరికించిందని అన్నారు. అసలు నిందితులపై కీలక సాక్ష్యాలు లేకుండా చేసిందని విమర్శించారు.
మంచి పరిణామం: చాడ
మక్కామసీద్ బాంబు పేలుళ్ల ఘటనలో తొమ్మిది మందిని నిర్దోషులుగా, 11 మందిని నేరస్థులుగా గుర్తిస్తూ న్యాయస్థానం శిక్షలు విధించడం మంచి పరిణామమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. ఏళ్లతరబడి కోర్టులలో కేసులు తేలకుండా పెండింగ్‌లో ఉండటం ఇబ్బందికరంగా మారుతుందని అన్నారు. ఆలస్యం కారణంగా నేరస్థులకు చట్టాల పట్ల ఏమాత్రం భయం లేకుండా పోతుందన్నారు. దేశవ్యాప్తంగా న్యాయమూర్తుల కొరత, న్యాయ సిబ్బంది కొరత కారణంగా సాదారణ కేసులు సైతం పరిష్కారానికి నోచుకోకుండా బాదితుల న్యాయం జరగడంలో జాప్యం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం న్యాయవ్యవస్థపై నిర్లక్ష్యాన్ని వీడి కోర్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
అత్యాచారాలపై కేంద్రం స్పందించాలి
దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని చాడ డిమాండ్ చేశారు. నిర్భయలాంటి కఠిన చట్టాలు ఉన్నా నిందితులకు శిక్షలు పడటం లేదని అన్నారు. చట్టాలను అమలు చేయాల్సిన వారే వాటిని తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు.