తెలంగాణ

విభజన హామీల అమలులో కేంద్రం నిర్లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 16: తెలంగాణ రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేంద్ర నిర్లక్ష్యవైఖరిని ఖండిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో సోమవారం జైల్‌భరో కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్రంలోని 31 జిల్లాల కలెక్టరేట్ల ముందు సీపీఐ నాయకులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ల ముందు జైల్‌భరోకు ప్రయత్నించిన సీపీఐ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్‌రెడ్డిలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. సీపీఐ చేపట్టిన జైల్‌భరో కార్యక్రమంలో రాష్టవ్య్రాప్తంగా సుమారు 4వేల మందికి పైగా పార్టీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విభజన హామీలను అమలు చేయడంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కేంద్రంపై ఒత్తిడి పెంచి హామీలను సాధించుకోవడం రాష్ట్ర ప్రభుత్వం కూడా తీవ్రంగా విఫలమైందని దుయ్యబట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొవాల్సిన దుస్థితి నెలకొందని అన్నారు. మోడీకి ముఖ్యమంత్రి కేసీ ఆర్ భయపడుతున్నారని, ప్రధాని మూతినాకేందుకు తప్ప కేసీఆర్ దేనికి పనిరాడంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మోడితో కేసీఆర్ లోపాయకార ఒప్పందం చేసుకొని, పార్లమెంట్‌లో వారికి మద్దత్తుగా వ్యవహరించారని ఆరోపించారు.