తెలంగాణ

దళితులు, గిరిజనులను అవమానిస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 16: దళితులు, గిరిజనులను కాంగ్రెస్ నాయకులు అవమానించేలా విమర్శలు చేస్తున్నారని టిఆర్‌ఎస్ పార్టీ తీవ్ర ఖండించింది. డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌పై కాంగ్రెస్ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణ చెప్పాలని టిఆర్‌ఎస్ డిమాండ్ చేసింది. సోమవారం ఎమ్మెల్సీ రాములు నాయక్, మాజీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మీడియాతో మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ ప్రజాప్రతినిధులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజక వర్గాలనే కాంగ్రెస్ నాయకులు లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు దళితులు, గిరిజనుల సంక్షేమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసారని విమర్శించారు. నాలుగేళ్లుగా సిఎం కేసీఆర్ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి చేస్తున్న కృషిని కాంగ్రెస్ నాయకులు ఓర్వలేకపోతున్నారని అన్నారు.