తెలంగాణ

ఫెడరల్ ఫ్రంట్‌లో మరో ముందడుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 17: కాంగ్రెస్, బిజేపీల నేతృత్వంలోని ఫ్రంట్‌లకు ప్రత్యామ్నాయంగా జాతీయ స్థాయిలో టిఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలో ఏర్పాటు కాబోతున్న ఫెడరల్ ఫ్రంట్‌కు మరో ముందడుగు పడింది. ఫెడరల్ ఫ్రంట్‌పై చర్చించడానికి మే మొదటి వారంలో భువనేశ్వర్ రావాల్సిందిగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నుంచి సిఎం కేసిఆర్‌కు మంగళవారం ఆహ్వానం అందినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. ఒడిశా రాష్ట్రంలో ప్రస్తుతం శాసనసభ సమావేశాలు జరుగుతుండటంతో మే మొదటి వారంలో భువనేశ్వర్‌కు రావాల్సిందిగా నవీన్ పట్నాయక్ చెప్పినట్టు పేర్కొన్నారు. ఫెడరల్ ఫ్రంట్‌పై ఇప్పటికే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతతో, బెంగళూరు వెళ్లి మాజీ ప్రధాని, జనతాదళ్ (సెక్యూలర్) అధినేత దేవెగౌడతో కేసీఆర్ చర్చించి వచ్చిన విషయం తెలిసిందే. జార్కండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌కుమార్ సోరబ్ అయితే ఆయనే హైదరాబాద్‌కు వచ్చి సిఎం కేసీఆర్‌తో చర్చలు జరిపారు. ఒడిశాకు వెళ్లి వచ్చాక, మే మూడవ వారంలో చెన్నై వెళ్లి డిఎంకె అధినేత కరుణానిధి, ఆయన కుమారుడు స్టాలిన్‌తో కూడా కేసీఆర్ చర్చలు జరుపనున్నట్టు టీఆర్‌ఎస్ వర్గాల సమాచారం.