తెలంగాణ

జూలై 1 నుండి రేషన్ డీలర్ల సమ్మె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 17: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్లు తమ సమస్యలను ప్రభుత్వం 2018 మే నెలలోగా పరిష్కరించకపోతే 2018 జూలై 1 నుండి నిరవధిక సమ్మె చేస్తామని ప్రకటించారు. రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం మంగళవారం హైదరాబాద్ (వాసవీ భవన్) లో జరిగింది. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు. 2017 నవంబర్‌లో సమ్మె చేయగా వెంటనే తమ సమస్యలను పరిష్కరిస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క సమస్య కూడా పరిష్కరించలేదని గుర్తు చేశారు. 2018 మే వరకు తమ సమస్యలు పరిష్కంచకపోతే మేలో హైదరాబాద్‌లో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. క్వింటాల్‌కు 200 రూపాయలు కమిషన్ ఇవ్వాలని, 2015 అక్టోబర్ నుండి రావలసి బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రేషన్ డీలర్ల నాయకులు నాయికోటి రాజు, సంజీవరెడ్డి, నాగరాజు, అన్వర్‌పాష, కేశవులు, మల్లేష్‌గౌడ్, కొండల్‌రెడ్డి, కృష్ణమూర్తి పాల్గొన్నారు.