తెలంగాణ

టీచర్ల నియామకానికి మార్గం సుగమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 25: తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల నియామకానికి సంబంధించి ఇంత కాలం సాంకేతిక సమస్యగా గమనించిన అపాయింట్ అథారిటీ వ్యవహారం కొలిక్కి వచ్చింది. అపాయింట్ అథారిటీగా పాత జిల్లాల అధికారులనే నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. టీచర్ల నియామకానికి ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి రావడంతో కొద్ది కాలం నియామక బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే అంశంపై తర్జన బర్జన జరిగింది. చివరికి టీఎస్‌పిఎస్‌సీకి అప్పగించినా కొత్త జిల్లాల ఆధారంగా నోటిఫికేషన్ ఇవ్వడంతో అదో పెద్ద వివాదమై కూర్చుంది. తర్వాత టెట్ అర్హత, అర్హత పరీక్షలో మార్కుల శాతం, మీడియం తదితర అంశాలపై అనేక వివాదాలు తలెత్తాయి. వీటన్నింటిపై న్యాయస్థానాల్లో పెద్ద ఎత్తున కేసులు నమోదైనా వాటిని పరిష్కరించుకుంటూ టీఎస్‌పిఎస్‌సీ ఈ వ్యవహారాన్ని కొలిక్కి తెచ్చింది. సబ్జెక్టుల వారీ, జిల్లాల వారీ, రిజర్వేషన్ల వారీ, మెరిట్ లిస్టులను తయారుచేసినా వారిని నియమించేది ఎవరనే మీమాంస ఎదురై కొద్ది కాలంగా దీనిపై న్యాయసలహాలు తీసుకున్న ప్రభుత్వం తాజాగా ఇందుకు సంబంధించి జీవో -40ని జారీ చేసింది.
2017 నవంబర్ 24న హైకోర్టు ఆదేశాలు
2017 అక్టోబర్ 10న పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన జీవో 25, 2017 డిసెంబర్ 11న పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన జీవో 33లకు అనుగుణంగా ప్రభుత్వం తాజాగా జీవో 40ని విడుదల చేసింది. పాత మార్గదర్శకాల్లో జిల్లా అంటే కొత్త జిల్లా అని, అపాయింట్ అథారిటీ అంటే ఆ జిల్లా విద్యాశాఖాధికారి అని స్పష్టం చేసింది. దీనిని హైకోర్టు ప్రశ్నించడంతో కొత్త ఆదేశాల్లో జిల్లా అంటే పూర్వ జిల్లా అని, అపాయింట్ అథారిటీ అంటే పూర్వ జిల్లా విద్యాశాఖాధికారి అని పేర్కొంది. ఫలితాల జాబితాలు జిల్లాలకు చేరగానే వాటిని తొలుత కామన్ క్వాలిఫైయింగ్ లిస్టులుగా రూపొందించి ప్రకటిస్తారు. ఆ తర్వాత ఖాళీలు, రోస్టర్ ఆధారంగా మెరిట్ లిస్టులను ప్రకటిస్తారు. వాటిపై అభ్యంతరాలను ఒకటి రెండు రోజులు స్వీకరించి, వాటిని ఖరారు చేసి కౌనె్సలింగ్ నిర్వహించి నియామక పత్రాలను అందజేస్తారు.