తెలంగాణ

మొదలైన ఇంటర్ సప్లిమెంటరీ: తొలి రోజు ఏడుగురు డిబార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 14: ఇంటర్ అడ్వాన్స్‌డ్ పరీక్షలు సోమవారం నాడు ప్రారంభం అయ్యాయి. తొలి రోజు తెలుగు, సంస్కృతం, హిందీ, ఉర్దూ, అరబిక్, ఫ్రెంచి, కన్నడ, మరాఠీ పరీక్షలు జరిగాయి. పరీక్షకు 93,281 మంది రిజిస్టర్ చేసుకోగా, 86,609 మంది పరీక్షలకు హాజరయ్యారు. 6672 మంది పరీక్షకు గైర్హాజరయ్యారు. జగిత్యాలలో ఇద్దరు, నిజామాబాద్‌లో ముగ్గురు, సిద్దిపేటలో ఒకరు, వికారాబాద్‌లో ఒకరిపై మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదుచేసి, వారిని పరీక్షల నుండి డిబార్ చేసినట్టు అధికారులు చెప్పారు. ప్రత్యేక పరిశీలక బృందాలను జనగామ, యాదాద్రి, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, సూర్యాపేట, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు పంపించినట్టు బోర్డు కార్యదర్శి అశోక్ చెప్పారు.