తెలంగాణ

ఆఫీస్, అనుభవం లేని సంస్థకు సింగరేణి ఓపెన్ కాస్ట్ టెండరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 14: ఆఫీసే లేని, అనుభవం ఏ మాత్రం లేని ఓ ప్రైవేటు సంస్థకు సింగరేణి సంస్థ టెండర్ కేటాయించిందని టీ.పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి ఆరోపించారు. కన్సల్టెంట్ ప్రైవేటు లిమిటెడ్‌కు 204 కోట్ల రూపాయల విలువ గల టెండర్ కట్టబెడతారా? అని గూడూరు నారాయణ రెడ్డి సోమవారం విలేఖరుల సమావేశంలో ప్రశ్నించారు. సింగరేణి ఓపెన్ కాస్ట్ తవ్వకాలను తిరిగి పూడ్చేందుకు ఆ సంస్థ ఇటీవల టెండర్లను ఆహ్వానించిందని ఆయన తెలిపారు. అర్హత లేని కన్సల్టెంట్‌కు టెండర్ కట్టబెట్టడం దారుణమని అన్నారు. పైలెట్ ప్రాజెక్టులో భాగంగా 10 నెలల్లో 50 వేల క్యూబిక్ మీటర్ల టార్గెట్ పెడితే, వెయ్యి 50 క్యూబిక్ మీటర్ల పని చేశారని ఆయన చెప్పారు. అయినా ఆ కన్సల్టెంట్‌కే టెండర్‌ను కేటాయించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. దీనికి ఎవరైనా ఇతర ముఖ్య నాయకులకు సంబంధం ఉందా?, వీటిలో అవినీతి జరిగిందన్న ఆరోపణలూ ఉన్నాయని అన్నారు. ఈ అంశంపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. తక్కువ కోట్ చేసిన వాళ్ళకు టెండర్ ఇవ్వకుండా ఆ సంస్థకే ఎందుకు ఇచ్చారని గూడూరు ప్రశ్నించారు.