తెలంగాణ

ఇక ప్రతి మే 14న క్రీడాకారులకు పండుగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ 14 మే: రానున్న రోజుల్లో మే 14న తెలంగాణ క్రీడాకారులు పండుగ చేసుకోవాల్సి ఉంటుందని రాష్ట్ర క్రీడలశాఖ మంత్రి పద్మారావుగౌడ్ అన్నారు. సోమవారం సచివాలంలో ఆయన విలేఖరులతో మాట్లాడారు. క్రీడాకారులు అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన వారికి ప్రభుత్వం 2 శాతం రిజర్వేషన్లును అమలు చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఉత్తర్వులు ఇచ్చారని ఆయన చెప్పారు. పతకాలతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ఉన్నత విద్యను అభ్యసించడానికి రిజర్వేషన్లు ఉపయోగపడతాయన్నారు. ఇటీవల కామన్‌వెల్త్‌గేమ్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులను సీఎం అభినందించారని ఆయన తెలిపారు. 29 క్రీడలకు 2 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తామన్నారు. సమావేశంలో తెలంగాణా రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ (శాట్స్) చైర్మన్ అల్లిపురం వేంకటేశ్వరరెడ్డి, కార్యదర్శి బి.వెంకటేశం,వైస్ చైర్మన్, ఎండి ఎ.దినకర్‌బాబు ఉన్నారు.

చిత్రం..విలేఖరులతో మాట్లాడుతున్న మంత్రి పద్మారావు