తెలంగాణ

రైతుబంధు పథకం కింద మరొక జాబితా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 14: రైతుబంధు పథకం కింద మరికొంత మంది రైతుల పేర్లతో కూడిన మరొక జాబితాను సోమవారం ప్రభుత్వం బ్యాంకర్లకు అందచేసింది. సచివాలయంలో జరిగిన బ్యాంకర్ల సమావేశంలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి. పార్థసారథి ఈ జాబితాను బ్యాంకర్లకు అందజేశారు.
ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్ మణికందన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ, ఈ జాబితాకు అనుగుణంగా చెక్కుల ముద్రణ వెంటనే చేపట్టి ఈ నెల 17 లోగా రైతులకు అందించాలని ఆదేశించారు.
చెక్కుల పంపిణీ చేసిన తర్వాత రైతులు వాటిని నగదుగా మార్చుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని బ్యాంకర్లను కోరారు. రైతుబంధు పథకం కింద సోమవారం 1252 గ్రామాల్లో 4.63 లక్షల మంది రైతులకు చెక్కులను అందజేశారు.

చిత్రం..రైతుల పేర్లతో ఉన్న అదనపు జాబితాను బ్యాంకర్లకు అందిస్తున్న వ్యవసాయ ముఖ్యకారదర్శి పార్థసారథి