తెలంగాణ

కోతులకు కుటుంబ నియంత్రణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 15: కోతుల సంఖ్యను అరికట్టేందుకు అటవీ శాఖ వానరాలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించాలని నిర్ణయించింది. నానాటికి అటవీ సంపద అంతరించిపోతుండటం, అందులోనూ పండ్ల చెట్లు సంఖ్య గణనీయంగా పడిపోవడంతో కోతులకు కావాల్సిన ఆహారం లభించడం లేదు. దీంతో వానరాలు ఆహార అనే్వషణ కోసం సమీప ప్రాంతాల్లోని గ్రామాలు, పట్టణాల్లోకి ప్రవేశిస్తున్నాయి. వేసవిలో ఈ వలసలు మరింత ఎక్కువగా ఉంటున్నాయి. ఒక్కసారిగా పదులు, వందల సంఖ్యలో వానరాలు అడవిని వదిలి జనావాసాల్లోకి ప్రవేశిస్తుండటంతో సమీప ప్రాంతాలకు చెందిన ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఊర్లపై పడుతున్న కోతులు చేస్తున్న చర్యలు అన్ని ఇన్ని కావు. దీంతో కోతుల బెడద నుంచి తమను రక్షించాలంటూ ఆయా ప్రాంతాల ప్రజలు నిత్యం అధికారులకు మొర పెట్టుకోవడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో వానరాలకు కుటుంబ నియంత్రణ శస్తచ్రికిత్సలు నిర్వహించడం ద్వారా వాటి సంఖ్యను తగ్గించాలని నిర్ణయించిన అటవీ శాఖ ఇందు కోసం ప్రత్యే క ఏర్పాట్లు చేస్తోంది. నిర్మల్‌లో ప్రత్యేక శస్తచ్రికిత్స కేంద్రా న్ని సైతం నిర్మించారు. ఈ కేంద్రంలో ఒకేసారి 50 కోతులకు శస్తచ్రికిత్సలు చేసేలా వసతులను సమకూర్చారు. శస్తచ్రికిత్సల అనంతరం వైద్యుల సూచనల మేరకు వనరాలను 10 నుంచి 20 రోజులు సంరక్షణ కేంద్రంలో ఉంచి అనంతరం దట్టమైన అడవి ప్రాంతంలో వదిలి వేస్తామని వైల్డ్ లైఫ్ అధికారి శంకరన్ తెలిపారు. త్వరలో రాష్టర్రాజధానిలో కూడా ఈ తరహా కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టు శంకరన్ పేర్కొన్నారు.
వైద్యులకు శిక్షణ..
కోతుల పెరుగుదలను నిరోదించే శస్తచ్రికిత్సలు నిర్వహించే వైద్యులు పరిమితంగా ఉండటంతో ఈ కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయడం కష్టతరంగా మారింది. దీంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పశు వైద్యులుగా సేవలు అందిస్తున్న వారికి ఈ చికిత్సలపై శిక్షణ ఇప్పించనున్నారు.
జీహెచ్‌ఎంసీ సహకారం..
జనవాసాల్లో తిరిగే కోతులను చాకచక్యంగా పట్టుకునే సిబ్బంది లేకపోవడంతో మహానగర పాలక మండలికి చెందిన బృందాల సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించినట్టు శంకరన్ తెలిపారు. దీని కోసం ఇప్పటికే జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపామని వారు సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు.