తెలంగాణ

అట్రాసిటీ చట్టం నిర్వీర్యానికి కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని, మే 17: ‘దళిత, గిరిజన బతుకులతో ఆటలాడుకుందామని చూస్తే ఊరుకునే సమస్యే లేదు... మా హక్కును ఎన్ని పోరాటాలు చేసైనా పరిరక్షించుకుంటాం’ అంబేద్కర్ ప్రసాదించిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నిర్వీర్యం చేసేందుకు న్యాయ వ్యవస్థ ద్వారా కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద క్రిష్ణ మాదిగ ధ్వజమెత్తారు. బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం పరిరక్షణకై తలపెట్టిన సింహ గర్జన సన్నాహక సదస్సులో మంద క్రిష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరై దళిత, గిరిజన కుటుంబాలను ఉద్దేశించి మాట్లాడారు. అట్రాసిటీ చట్టం లేక ముందు దేశంలో, రాష్ట్రంలో దశాబ్దాల క్రితం దళిత, గిరిజనులను ఊచకోతలు కోసారని, దీనికి ఉదాహారణగా కారంచెడు, చుండూర్ ఘటనలను గుర్తు చేశారు. కర్ణుడికి కవచకుండలాలు ఎలానో దళిత, గిరిజనులకు అట్రాసిటి చట్టం కూడా కవచకుండాలాలు వంటివేనని పేర్కొన్నారు. అత్యాచార నిరోధక చట్టాన్ని రద్దు చేసే దిశగా జరుగుతున్న కుట్రలపై దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు జరుగుతుంటే రిజర్వేషన్లతో గద్దెనెక్కిన మహా నేతలు ప్రశ్నించకపోవడంపై మందక్రిష్ణ మండిపడ్డారు. ఇలాంటి ఘటనలపై మాయావతి, పాశ్వన్ లాంటి మహానేతలు నోరు మెదపకపోవడం సరైంది కాదని అన్నారు. అత్యాచార నిరోధక చట్టాన్ని పరిరక్షించుకునే దిశగా దళిత, గిరిజన జాతులంతా దేశవ్యాప్తంగా ఒక్కటి కాబోతున్నామని, వరంగల్‌లో సింహగర్జన పేరిట తలపెట్టిన భారీ సదస్సుకు దేశవ్యాప్తంగా ఉన్న దళిత, గిరిజన కుటుంబాలు భారీగా తరలి రానున్నాయని, 30లక్షల మందితో సింహగర్జన తలపెట్టిన్నట్లు మందక్రిష్ణ స్పష్టం చేశారు. మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి.చెన్నయ్య, లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు బెల్లయ్య నాయక్ మాట్లాడుతూ... దళిత, గిరిజన కుటుంబాలకు మళ్లీ అన్యాయం చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని, వీటిని తిప్పికొడతామని అన్నారు. ఈ సదస్సులో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు అద్దంకి దయాకర్‌తోపాటు వందలాది మంది దళిత, గిరిజన కుటుంబాలు పాల్గొన్నాయి.