తెలంగాణ

భైంసా మారణకాండను ఛేదించిన పోలీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్, మే 21: రాష్టవ్య్రాప్తంగా సంచలనం సృష్టించిన ఆదిలాబాద్ జిల్లా భైంసా హత్యలకు సంబంధించి 9 మంది నిందితులను శనివారం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 10న ఆదిలాబాద్ జిల్లా భైంసాలో కేవలం అరగంటలో ఐదు హత్యలు జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఆస్తి, కుటుంబ తగాదాల వల్లే ఈ హత్యలు జరిగినట్లు పోలీసులు తేల్చారు. ఈ సంఘటనకు సంబంధించి జిల్లా ఎస్పీ తరుణ్‌జోషి శనివారం నిర్మల్‌లోని డిఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో హత్యలకు పాల్పడ్డ 9 మంది నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం... భైంసా పట్టణంలోని భారిమామ్‌గల్లీలో నివాసం ఉండే 60 ఏళ్ల నియామతుల్లాఖాన్‌తోపాటు ఇదే గల్లీలో నివాసముంటూ పాత ఇనుప సామాను దుకాణాన్ని నిర్వహించే 34 ఏళ్ల యూనిస్‌ఖాన్, 55 ఏళ్ల వహిదాఖాన్, 65 ఏళ్ల అక్రమ్‌బి అనే మహిళలతోపాటు 14 ఏళ్ల ఆయేషాఖానం ఈ నెల 10న దారుణహత్యకు గురయ్యారు. కేవలం అరగంట వ్యవధిలో జరిగిన ఈ మారణకాండలో నిందితులు తల్వార్‌లతో దాడి చేయడంతో బాధితులంతా అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఈ సంఘటనపై భైంసా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేయగా నిందితులంతా బాధితుల రక్తసంబంధీకులేనని తేలింది. ఈ హత్యలకు పాల్పడ్డ వారిలో ఎ-1గా భైంసా పట్టణంలోని నయాబాదికి చెందిన మహ్మద్ జావిద్‌ఖాన్, ఎ-2గా బారిమామ్ గల్లీకి చెందిన సయ్యద్ మాజిద్ అలి, ఎ-3గా భైంసా పట్టణానికి చెంది ప్రస్తుతం నిజామాబాద్‌లో నివాసముంటున్న సయ్యద్ సాదక్‌లను అరెస్ట్‌చేశారు. అలాగే ఎ-4గా బాన్సువాడ సమీపంలోని నల్మట్టి పాహడ్ ప్రాంతంలో నివాసముంటున్న మహ్మద్ నీరుల్లాఖాన్, ఎ-5గా నిజామాబాద్‌లోని బాబానగర్‌లో నివాసముంటున్న సయ్యద్ సాజిద్, ఎ-6గా భైంసాలోని ఓవైసీ నగర్‌కు చెందిన అసదుల్లాఖాన్, ఎ-7గా ఇదే కాలనీకి చెందిన అత్తుఖాన్, ఎ-8గా నిజామాబాద్‌లోని బాబానగర్‌లో నివాసముంటున్న సయ్యద్ సుల్తానా బేగం, ఎ-9గా ఇదే ప్రాంతానికి చెందిన సయ్యద్ వాజిద్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. భైంసా పట్టణంలోని బారిమామ్ గల్లిలో గల ఓ ఇంటి స్థలానికి సంబంధించి 2013 నుండి వీరిమధ్య గొడవలు జరుగుతున్నాయి. గతంలో జరిగిన గొడవలకు సంబంధించి కేసులు కూడా నమోదుకావడంతో నిందితులకు జైలు శిక్ష కూడా ఖరారైంది. ప్రస్తుతం బెయిలుపై బయటకు వచ్చిన జావిద్‌ఖాన్, సయ్యద్ మాజిద్ అలీ, నూరుల్లాఖాన్ ఈ హత్యలకు పథకాన్ని రచించినట్లు గుర్తించారు. వీరందరిపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించనున్నట్లు ఎస్పీ వివరించారు.