తెలంగాణ

రేపు ఎమ్సెట్ ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ ఎమ్సెట్ ఫలితాలను ఈనెల 19వ తేదీన ప్రకటించనున్నారు. 2వ తేదీ నుండి 7వ తేదీ వరకూ ఆన్‌లైన్‌లో ఎమ్సెట్ పరీక్షను నిర్వహించారు. అగ్రికల్చర్ స్ట్రీంకు 73078 మంది రిజిస్టర్ చేసుకోగా, 71,766 మంది హాజరయ్యారు. ఇంజనీరింగ్ స్ట్రీంకు 1,47,912 మంది రిజిస్టర్ చేసుకోగా 1,36,311 మంది హాజరయ్యారు. 18వ తేదీన ఫలితాలను ప్రకటించాలని తొలుత భావించినా, అనివార్య కారణాలతో 19న విడుదల చేయనున్నట్టు తెలిసింది. ఫలితాలను వివిధ సామాజిక మాధ్యమాల్లో ప్రకటించడంతో పాటు ఎమ్సెట్ వెబ్ పోర్టల్‌లో కూడా ఉంచుతారు. రాష్ట్రంలో బిఎస్సీ ఆనర్స్ -అగ్రికల్చర్, బిఎస్సీ ఆనర్స్ హార్టికల్చర్, బిఎస్సీ ఫారెస్ట్రీ, బీవీఎస్సీ అండ్ యానిమల్ హస్బెండరీ, బీఎఫ్‌ఎస్సీ (బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్), బి. ఫార్మసీ, బిటెక్ బయోటెక్నాలజీ, బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ బయోటెక్నాలజీ, ఫార్మాడీ సబ్జెక్టుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్షలను నిర్వహించారు. ఇంజనీరింగ్ విభాగంలో బిఈ/బీటెక్, బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బీటెక్ బయోటెక్నాలజీ, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, ఫార్మాడీ కోర్సుల్లో ప్రవేశానికి ఎమ్సెట్‌ను నిర్వహించారు.