తెలంగాణ

యువతకు స్ఫూర్తినిచ్చే కార్యక్రమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 17: తెలంగాణ యువతలో విజయస్ఫూర్తిని నింపి వారిలో చైతన్యం తీసుకువచ్చేందుకు, మార్గదర్శకంగా నిలిచేందుకు టీశాట్ ప్రణాళిక రూపొందించింది. అం దులో భాగంగా ఇటీవలె వెలువడిన 2017 సివిల్ సర్వీసెస్ తుది ఫలితాల్లో విజేతలుగా నిలిచిన అభ్యర్ధుల గాథలను ప్రత్య క్ష ప్రసారం ద్వారా ప్రసారం చేస్తూ నే కొత్తగా సివిల్స్ రాస్తున్న వారి అనుమానాలను నివృత్తి చేసేందుకు ప్రణాళిక రచించింది. ఇం దులో భాగంగా అఖిల భారత స్థాయిలో ప్రధమ ర్యాంకు సాధించిన తెలంగాణ అభ్యర్థి దురిశెట్టి అనుదీప్ తొలుత ప్రత్యక్ష ప్రసారానికి హాజరవుతారు.
సివిల్స్ రాస్తున్న అభ్యర్ధులకు తనదైన సహకారం అందిస్తున్న తెలంగాణ రాచకొండ పోలీసు కమిషనర్ ఎం ఎం భగవత్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో పాల్గొంటారు. శుక్రవా రం ఉదయం 11 గంటల నుండి 12 వరకూ టీశాట్ స్టుడియోలో జరిగే ప్రత్యక్ష ప్రసారం లో వీరు పాల్గొంటారని, ఛానల్ సీఈఓ శైలేష్‌రెడ్డి తెలిపారు. టీశాట్ టోల్‌ఫ్రీ 18004254038 లేదా 040- 23553473/ 040-23551 989 నెంకు ఫోన్ చేసి అనుమానాలను నివృత్తి చేసుకోవాలని కోరారు.