తెలంగాణ

వన్యప్రాణుల సంరక్షణపై ప్రత్యేక దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 17: వేసవిలో వణ్యప్రాణుల సంరక్షణపై అటవీ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. మండుటెండలో దట్టమైన అడవిలోని కుంటల్లోని నీరు సైతం ఆవిరై పోతుండటంతో మూగ జీవాలు నీటి కోసం అల్లాడుతున్నట్టు అధికారులు గుర్తించారు. వేసవిలో అడవి పలుచబడుతుండటంతో ఆహార అనే్వషణతో పాటు నీటి కష్టాలతో క్రూర మృగాలను, సాదారణ జంతులు విలవిలలాడుతున్నాయి. దీంతో ఆయా జీవాలు సమీపంలోని గ్రామాలు, పట్టణాల్లోకి ప్రవేశించి నానా హంగామా సృష్టించడం సర్వసాదారణంగా మారింది. క్రూర మృగాలు గ్రామాల్లోకి వచ్చినప్పుడు వణికి పోతున్న వారు సాదారణ జంతువులు వచ్చినప్పుడు వాటికి హాని తలపెడుతున్నారు. కొందరు వేటగాళ్లు ఇదే అదునుగా భావించి అటవి జంతులను వేటాడుతున్నారు. వీటన్నింటి నుంచి వన్యప్రాణులను రక్షించేందుకు అటవి మద్యలో నీటిని ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. గతంలో నీటి కుంటలు ఉన్న చోటు భారీ నీటి సాసర్ల వంటివి ఏర్పాటు చేసి వాటిల్లో నీటిని నింపుతున్నారు. సమీప ప్రాంతాల్లోని గ్రామాల నుంచి ట్యాంకర్ల ద్వారా నీటిని తరలిస్తున్నారు. జనావాసాలకు చాలా దూరంగా ఉన్న ప్రాంతాల్లో బోర్లను వేసి సోలార్ పంప్‌సెట్లను బిగిస్తున్నారు. వీటిని ఆటోమేటిక్ పద్దతిలో ఆన్ ఆఫ్ అయ్యే ఏర్పాట్లను సైతం చేశారు. అటవీ శాఖ చేస్తున్న ఈ తరహా ఏర్పాట్లతో మూగజీవాల పాలిట వరం లాంటివని వన్యప్రాణి సంరక్షకులు అంటున్నారు.
ఇప్పటికే మానవుని స్వార్ధం వల్లే అటవీ జీవాలు అంతరించి పోతున్నాయని వాటిని సంరక్షించేందుకు ఎంతటి చర్యలు తీసుకున్నా తక్కువేనని పేర్కొంటున్నారు. ప్రభుత్వం మరింత నిధులు కేటాయించి అటవిని సంరక్షించడంతో పాటు అడవిలో జీవించే అన్ని రకాల ప్రాణులు హాయి గా ఉండే ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.
బీట్ ఆఫీసర్లతో ప్రత్యేక పహారా
వేసవిలో నీటి కోసం జనాసాలకు, నీరు ఉన్న చెరువుల వద్దకు వచ్చే ప్రాణులను వేటాడటమే లక్ష్యంగా చేసుకున్న వారి నుంచి మూగజీవాలను రక్షించేందుకు అటవి శాఖ కఠినంగా వ్యవరిస్తుంది. ఇందు కోసం బీట్ ఆఫీసర్లతో నిత్యం ప్రత్యే పహారా నిర్వహిస్తున్నారు. ప్రత్యేంగా నీటి వనరులు ఏర్పాటు చేసిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి అలాంటి ప్రయత్నాలు చేసే వారిని గుర్తించే పనిలో పడ్డారు. ఎవరైనా ప్రాణులకు వేటాడటం, హాని కలిగించేలా వ్యవహరించడం వంటివి చేసే అటవి హక్కు చట్టాల క్రింద శిక్షించనున్నారు.