తెలంగాణ

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఫీడ్‌బ్యాక్ తప్పనిసరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 17: ఇజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో వాణిజ్య, వ్యాపార వర్గాల నుంచి ఫీడ్ బ్యాక్ తప్పనిసరిగా తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి సంబంధిత అధికారులను ఆదేశించారు.
వివిధ శాఖల నుంచి అందుతున్న ఆన్ లైన్ సేవలపై వినియోగదారులు, వాణిజ్య వర్గాల నుంచి ఫీడ్ బ్యాక్ సేకరించాలన్నారు. సచివాలయంలో గురువారం ఇజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సిఫారసుల అమలుకు వివిధ శాఖలు తీసుకున్న చర్యలను సిఎస్ జోషి సమీక్షించారు. కేంద్ర డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండస్ట్రీయల్ పాలసీ, ప్రమోషన్‌లో సంస్కరణల అమలుపై పారిశ్రామిక వర్గాల నుంచి ఫీడ్ సేకరిస్తుందన్నారు. రాష్ట్రంలో ఇజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలులో వ్యాపార, వాణిజ్య వర్గాల నుంచి ఫీడ్ బ్యాక్‌ను సేకరించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం వాణిజ్య, ఆర్కిటెక్ట్, ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్, న్యాయవాదుల నుంచి ఫీడ్ బ్యాక్ సేకరిస్తుందని వివరించారు. పరిశ్రమలు, న్యాయ, కార్మిక, బాయిలర్స్, మున్సిపల్, విద్యుత్, కాలుశ్య నియంత్రణ బోర్డు, అటవీశాఖలలో 78 అంశాలపై ఫీడ్ బ్యాక్ సేకరణకు ఇప్పటికే శిబిరాలు నిర్వహించామని, ఇందులో ఇప్పటికే పలు ప్రశ్నలపై ఆన్ లైన్ సర్వేలు నిర్వహించినట్టు అధికారులు వివరించారు. ఇజ్ ఆఫ్ బిజినెస్‌లో 372 సిఫారసులను పరిశ్రమలశాఖలో అమలు చేయడం పట్ల సిఎస్ జోషి సంబంధిత అధికారులను అభినందించారు.