తెలంగాణ

ఆర్టీసీ కార్మికులను బెదిరిస్తున్న కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 17: తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమానికి అండదండగా ఉన్న ఆర్టీసీ కార్మికులను ముఖ్యమంత్రి కేసీఆర్ బెదిరిస్తున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. గురువారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పొన్నం ప్రభాకర్ ముఖ్యమంత్రి, ఉద్యోగ సంఘం నేతల తీరును ఎండగట్టారు. ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల ముందు కేసీఆర్ ఈ మాట అని ఉంటే బాగుండేదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ ఉద్యోగులు అంటే ముఖ్యమంత్రికి, రవాణ శాఖ మంత్రికి పట్టింపు లేకుండా పోయిందని విమర్శించారు. ఉద్యమ సమయంలో, రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఎన్ని కోట్లు ఖర్చు అయినా ఆర్టీసీని ప్రభుత్వ నిర్వహిస్తుందని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామని చెప్పిన మాటలు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. ఎవరినైనా వాడుకొని వదిలివేయడం కేసీఆర్ దిట్ట అని అన్నారు. ఆర్టీసీ కార్మిక సంఘానికి మంత్రి హరీష్‌రావు గౌరవ అధ్యక్షుడిగా ఉండటమే వారికి శాపంగా మారి ఉంటుందని అన్నారు. కేటీ ఆర్, కవితలు అధ్యక్షులుగా ఉంటే కార్మికులకు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని అభిప్రాయపడ్డారు. సంస్థను నడపాలో వద్దో కార్మికులే నిర్ణయించుకోవాలని బెదిరింపులకు పాల్పడుతున్న కేసీ ఆర్‌కు ఆర్టీసీ కార్మికులు వచ్చే ఎన్నికల్లో తగిన విధంగా బుద్దిచెప్పాలని కోరారు. కేసీఆర్ తనకు తాబేదారులైన ఉద్యోగ సంఘం నాయకులతోనే చర్చలు జరుపుతున్నారని విమర్శించారు. కొంత మంది ఉద్యోగ సంఘాల నాయకులు కేసీ ఆర్‌కు తొత్తులుగా మారి ఉద్యోగులను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఉద్యోగ ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెబుతూనే ఉద్యోగుల కోసం ఉన్న ట్రిబ్యూనల్‌ను ఎత్తివేశారని అన్నారు. స్వామిగౌడ్‌ను మంత్రిని చేస్తామని చెప్పి మోసం చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. కేసీఆర్ చెంచాలతో మీటింగ్ పెట్టుకొని ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న నాయకులను దూరం పెట్టడం ఎంత వరకు సమంజసమని అన్నారు. కాలయాపన కోసమే కమిటీలని, ఉద్యోగుల ప్రధాన డిమాండ్ సీపీ ఎస్‌పై పార్టీలో చర్చిస్తున్నామని, త్వరలో పార్టీ తరుపున ప్రకటన చేస్తామని చెప్పారు. ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఆర్టీసీ ఉద్యోగుల పట్ల ప్రభుత్వ వ్యవహరిస్తున్న తీరు విచారకరమని ఎమ్మెల్యే చిన్నారెడ్డి అన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే తమిళనాడు తరహాలో ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయించి ఆర్టీసీ ఆదుకోవాలని డిమాండ్ చేశారు.