తెలంగాణ

రైతుబంధుతో నూతన అధ్యాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, మే 17: భారతదేశమే ఆశ్చర్యపోయే విధంగా భూరికార్డులు ప్రక్షాళన చేసి పెట్టుబడికి నగదు సాయాన్ని అందించి చరిత్రలోనే ఒక నూతన అధ్యాయానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని ఏల్లంపేట గ్రామంలో గురువారం ఏర్పాటు చేసిన రైతుబంధు పథకం చెక్కుల పంపిణీ, పట్టాదార్ పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంట పెట్టుబడి కోసం రాష్ట్రంలోని 38 లక్షల మంది రైతులకు ఎకరానికి రెండు పంటలకు రూ. 8వేల రూపాయల వ్యవసాయ పెట్టుబడి అందించేందుకు రూ. 12 వేల కోట్ల బడ్జెట్‌ను కేటాయించామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం అమలుచేస్తున్న పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో అమలుచేయడం లేదని భారతదేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శం అన్నారు. గత ప్రభుత్వాలు 3, 4 గంటలు విద్యుత్‌ను రైతులకు సరఫరా చేస్తుండేవని.. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్‌ను రైతాంగానికి అందజేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని పోరాడి సాదించారని అదే పోరాట స్ఫూర్తితో భారతదేశం గర్వించేస్థాయిలో మన రాష్ట్రాన్ని ప్రగతిపథంలో ముందుకు తీసుకువెళ్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలుచేస్తున్న ప్రజాసంక్షేమ, అభివృద్ధి పథకాల పట్ల దేశవ్యాప్తంగా చర్చసాగుతుందని కేంద్రప్రభుత్వంతో సహా అన్ని రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్రంవైపు చూస్తున్నాయన్నారు. రానున్న కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించనున్నారని మహమూద్‌అలీ తెలిపారు. రైతుబంధు పథకం ఏ మ్యానిఫెస్టోలోనూ హామీ ఇవ్వలేదని గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా హామీ ఇవ్వని అనేక పథకాలను కార్యరూపంలో చూపిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిదే అని ప్రకటించారు. రైతుసంక్షేమమే ధ్యేయంగా రాష్టవ్య్రాప్తంగా 38 లక్షల మంది రైతులకు సంబంధించి రూ. 16,163 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రైతురాజుగా మారిన నాడే దేశం అభివృద్ధి చెందుతుందనే లక్ష్యంతో వ్యవసాయాన్ని పండుగ చేసేదిశగా మరెన్నో కార్యక్రమాలు చేపట్టడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ఎకరా సాగుభూమికి రెండు పంటలకు నీరు అందించేవిధంగా ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచానికే ఆదర్శం అని తెలిపారు. అస్తవ్యస్తంగా ఉన్న భూరికార్డులను రెవెన్యూశాఖ ద్వారా వందరోజుల్లో శుద్ధిచేసి సరికొత్త చరిత్రను సృష్టించడం జరిగిందన్నారు. ఇప్పటికే రైతులకు కొత్త పాస్‌పుస్తకాలను అందించడం జరుగుతుందని జిల్లాలో మిగిలి ఉన్న, వివాదంలో ఉన్న రైతుల భూములకు ఈ నెల 18తర్వాత పట్టాదార్ పాస్‌పుస్తకాలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శివలింగయ్యను ఆదేశించారు. రైతుబంధు పథకం ద్వారా మహబూబాబాద్ జిల్లాలోని లక్షా 24వేల మంది రైతులకు రూ.120కోట్ల రూపాయలు వ్యవసాయ పెట్టుబడితో పాటు పట్టాదార్ పాస్‌పుస్తకాలు అందుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరు ఆశీర్వదించి అండగా నిలువాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి అజ్మీర చందులాల్, మానుకోట ఎంపీ అజ్మీర సీతారాంనాయక్, డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్, రైతుసమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ శివలింగయ్య తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..రైతు బంధు సభలో మాట్లాడుతున్న రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, మహమూద్ అలీ