తెలంగాణ

రూ. 40వేలు ఇచ్చినా వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, మే 17: సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి నిజంగా రైతుల పట్ల ప్రేమ ఉంటే నాలుగేళ్ల క్రితమే రైతుబంధు పథకం తెచ్చేవారని, వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలువదని తెలిసే ఇప్పుడు రైతుబంధు పథకం తీసుకొచ్చారని సీఎల్పీ ఉపనేత, నల్లగొండ శాసనసభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. నెల రోజుల అమెరికా పర్యటన ముగించుకుని గురువారం నల్లగొండకు వచ్చిన కోమటిరెడ్డికి మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో పాటు కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అనంతరం కోమటిరెడ్డి తన నివాసంలో 40మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం రైతుకు పంటకు నాలుగు వేలు కాదు 40 వేలు ఇచ్చినా రానున్న ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ రైతు ప్రభుత్వమేనన్నారు. రైతుకు ఎంత ఇచ్చినా తక్కువేనన్నారు. కేసీఆర్ మోసపూరిత పాలనలో లక్షల కోట్లు ఆంధ్ర కాంట్రాక్టర్లు దోచుకుంటుండగా రైతులకు ఇచ్చే నాలుగు వేలు తెలంగాణ ప్రభుత్వానికి లెక్కకాదన్నారు. సంక్షోభంలో ఉన్న రైతాంగాన్ని ఆదుకోవాలని తాము ఎన్నోసార్లు అసెంబ్లీ, బయట రైతు సమస్యలపై పోరాడామన్నారు. చివరకు ఎన్నికల సంవత్సరంలో రైతుబంధు పథకం తెచ్చిన సీఎం కేసీఆర్ ఉన్నన్ని రోజులైనా పథకం సక్రమంగా అమలు చేయాలన్నారు. రైతుబంధు సొమ్ము పెద్దల పాలుకాకుండా పేద రైతులకు అందించేలా పథకాన్ని అమలు చేయాలన్నారు. 40 శాతంకు పైగా ప్రతి గ్రామంలో పాస్‌పుస్తకాలు, చెక్కుల జారీలో తప్పులు వెలుగు చూస్తున్నాయని వాటిని వెంటనే పరిష్కరించి రైతులందరికీ రైతుబంధు సహాయం అందించాలని డిమాండ్ చేశారు. పాస్‌పుస్తకాల తప్పుల వెల్లువ చూస్తే భూరికార్డుల శుద్ధీకరణ డొల్లగా తేలిపోతుందన్నారు. కౌలు రైతులకు కూడా రైతుబంధు సహాయం అందించేలా చూడాలన్నారు. సబ్సిడీ గొర్రెల స్కీమ్ మాదిరిగా రీసైక్లింగ్‌తో దళారులు, ఆంధ్ర వ్యాపారులు, బినామీలు లాభపడినట్లుగా కాకుండా రైతుబంధు పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. కౌలు రైతులకు కూడా రైతుబంధు పథకాన్ని వర్తింపచేసేలా చర్యలు చేపట్టాలన్నారు. వచ్చే ఎన్నికల్లో రైతులు ఓట్లు వేయరని గ్రహించే రైతుబంధు పథకం తెచ్చారని, రైతుల సంక్షేమం పట్ల కేసీఆర్‌కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే పంటల మద్ధతు ధర పెంచాలన్నారు. గతంలో వైఎస్సార్ ప్రభుత్వ హయాంలోనే ఉచిత విద్యుత్ అమలు మొదలైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతుల రుణమాఫీ అమలు చేసి అన్ని పంటలకు మద్దతు ధర పెంచుతుందన్నారు. కాంగ్రెస్ పాలనతోనే రైతులు, పేదలు, దళితులు, బలహీన వర్గాలకు మంచి రోజులు వస్తాయన్నారు. ఈ సమావేశంలో డీసీసీబీ డైరక్టర్ పాశం సంపత్‌రెడ్డి, జడ్పీటీసి నార్సింగ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..అమెరికా నుండి తన నియోజకవర్గానికి తిరిగి వచ్చిన కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డికి కాంగ్రెస్ శ్రేణుల స్వాగత, సన్మానాలు