తెలంగాణ

రైతుబంధు భూస్వాములకు వరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్,మే 17: రాబోయే ఎన్నికల్లో బహుజన లెప్ట్ ఫ్రంట్ పార్టీ రాజ్యాధికారమే లక్ష్యంగా 65శాతం బీసీ వర్గాలకు టికెట్లు ఖరారు చేయనుందని, రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిని చేస్తామని బీఎల్‌ఎఫ్ రాష్ట్ర కన్వీనర్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బిఎల్‌ఎఫ్ పార్లమెంటరీ, నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించగా తమ్మినేని ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణలో దొరల పాలన సాగుతోందని, దీనిని అంతమొందించడమే లక్ష్యంగా 145 కిలోమీటర్ల పొడవునా దళిత, బలహీన వర్గాల కూటమితో పాదయాత్ర నిర్వహించడం జరిగిందన్నారు. రైతు బంధు పథకం మంచిదే అయినప్పటికీ భూస్వాములకు వరంగా మారుతోందని, పెద్ద ఎత్తున ప్రజల సొమ్మును బడాబాబులకు ధారాదత్తం చేస్తున్నారని ధ్వజమెత్తారు. వ్యవసాయ సంక్షోభ నివారణకు రైతుబంధు పథకం ఒక్కటే నివారణ కాదని, కేంద్ర ప్రభుత్వం పంట ఉత్పత్తులకు ప్రకటించే మద్దతు ధరకు తోడుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. పంట ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించే విషయంలో కేరళలో విజయవంతంగా సాగుతోందని అన్నారు. రాష్ట్రంలో కొత్త పరిశ్రమలను వ్యవసాయానికి అనుబంధంగా తీసుకవస్తే రైతులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. మార్కెట్‌లో దళారీ వ్యవస్థను అంతమొందించేందుకు ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పాటుపడాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీసీల జనాభా 50 శాతం పైనే ఉన్నప్పటికీ రాజ్యాధికారం దక్కకపోవడం శోచనీయమని అన్నారు. బిఎల్‌ఎఫ్ లక్ష్యం విద్య, వైద్యం, భూమి, ఉద్యోగ కల్పన, సామాజిక న్యాయం అన్ని వర్గాలకు అందించడమేనని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సమన్యాయం జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని, పార్టీలు రిజర్వేషన్లను తప్పకుండా అమలుపర్చాలన్నారు. కాంగ్రెస్, బీజేపీ 70 ఏళ్ల పాలన మాదిరిగానే టీఆర్‌ఎస్ పాలన కొనసాగుతుందని, పేద ప్రజలకు, రైతులకు, కర్షకులకు సమన్యాయం జరగడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆదాయంలో ధనిక రాష్ట్రం కాదని, ధనికుల కోసమే పాలనగా మారుతుందన్నారు. ఇప్పటికీ గిరిజనులకు మెరుగైన వైద్యసేవలు అందక ఎంతోమంది చనిపోతుంటే ధనిక రాష్ట్రం ఎలా అవుతుందని ప్రశ్నించారు. పౌష్టికాహార లోపంతో పిల్లలు, గర్భిణులు మృత్యువాత పడుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందన్నారు. దళారీ వ్యవస్థను రూపుమాపడమే లక్ష్యంగా పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని అన్నారు. టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో ఓట్లకోసం డబ్బులు వెదజల్లేందుకు బడావ్యాపారులే డబ్బులు సమకూర్చుతారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన పార్టీలు బడా వ్యాపారవేత్తలకు కొమ్ముకాస్తూ వారికి లాభం చేకూర్చడం ఆనవాయితీగా వస్తుందన్నారు. మే, జూన్, జులై మాసంలో బీఎల్‌ఎఫ్ పూర్తిస్థాయి కమిటీలను ఏర్పాటు చేసుకొని ప్రజల వద్దకు వెళ్ళాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిఎల్‌ఎఫ్ రాష్ట్ర చైర్మన్ నల్ల సూర్యప్రకాష్, సీపీఎం రాష్ట్ర నాయకులు రాములు, లంక రాఘవులు పాల్గొన్నారు.

చిత్రం..సమావేశంలో ప్రసంగిస్తున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం