తెలంగాణ

రైతు సంక్షేమానికి నిరంతర కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, మే 17: రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని, రైతులు బాగుపడితేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహామూద్ అలీ అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో రైతులకు తీరని అన్యాయం జరిగిందని, వారి బాగోగులను ఏనాడు పట్టించుకోలేదని విమర్శించారు. తెలంగాణ సర్కార్ అధికారంలోకి వచ్చాక రైతుల సంక్షేమం కోసమే 12వేల కోట్ల రూపాయలతో రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. గురువారం రాత్రి సిద్దిపేట జిల్లా నారాయణరావుపేటలో రైతుబంధు పథకం ముగింపు సభలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణ ప్రభుత్వం రాగానే ఆత్మహత్య నివారణ కోసం 16వేల 231 కోట్లతో రుణమాఫీ చేసిందన్నారు. రైతు సంక్షేమం కోసం బడ్జెట్‌లో 12వేల కోట్ల రూపాయలను ప్రత్యేకంగా కేటాయించడం జరిగిందన్నారు. దేశంలో ఏరాష్ట్రంలో కూడ కేటాయించలేదన్నారు. సంక్షేమ రంగంలో తెలంగాణ నంబర్‌వన్ అని అన్ని రాష్ట్రాలు తెలంగాణ వైపు చూస్తున్నాయన్నారు. దేశంలోనే సీఎం కేసీఆర్ నంబర్‌వన్ సీఎం అని, సిద్దిపేట నంబర్‌వన్ నియోజకవర్గం అని ఆయన కొనియాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టు అన్నారు. తెలంగాణను కోటి ఏకరాల మాగాణిగా మారేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ సర్కార్ అధికారంలోకి రాగానే భూసమస్యలతో కొట్టుమిట్టాడుతున్న రైతాంగం కోసం భూసర్వే చేపట్టి రికార్డులను క్రమబద్ధీకరించిందన్నారు. పాసుపోర్ట్ తరహాలో 17రకాల సెక్యూరిటీ ఫ్యూచర్‌తో పట్టా పాసు పుస్తకాలు అందజేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ సర్కార్ సంక్షేమ రంగంలో నంబర్ వన్‌గా ఉందనీ, 45వేల కోట్లతో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. అనంతరం రైతుబంధు పథకం చెక్కులను రైతులను అందజేశారు. రైతుబంధు పథకం ద్వారా నారాయణరావుపేటకు వచ్చిన డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, ఆర్‌ఎస్‌ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, ఫారూక్‌హుస్సేన్, ఎమ్మెల్యే యాదగిరిరెడ్డిని నాగలి, కండువాలతో ఘనంగా సన్మానించారు.

చిత్రం..డిప్యూటీ సీఎం, మంత్రులను, ఎమెల్సీలను నాగలి, కండువాలతో సన్మానిస్తున్న దృశ్యం