తెలంగాణ

ఉద్యోగులకు కొత్త వేతన సవరణ కమిషన్ ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 18: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి వేతన సవరణ కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసారు. రిటైర్డు ఐఏఎస్ అధికారి సిఆర్ బిస్వాల్ చైర్మన్‌గా కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ, సభ్యులుగా రిటైర్డు ఐఏఎస్ అధికారులు సి ఉమామహేశ్వర్‌రావు, డాక్టర్ మహమద్ ఆలీ రఫత్‌ను నియమించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి మూడు నెలలలోపు కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక సంస్థలు, ఎయిడెడ్ సంస్థలు, విశ్వవిద్యాలయాలతో పాటు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, జవహార్‌లాల్ నెహ్రూ టెక్నాలాజికల్ విశ్వవిద్యాలయాలకు చెందిన బోధనేతర సిబ్బంది, వర్క్‌చార్జ్‌డ్ ఉద్యోగులు, ఫుల్ టైమ్ కాంటిజెంట్ ఉద్యోగులకు సంబంధించిన వేతనాలకు సవరణకు కమిషన్ సిఫారసులు సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కరువు భత్యాన్ని ఏ మేరకు పెంచాలని సూచిస్తూనే కరువు భత్యాన్ని కలిపి వేతన సవరణకు సిఫారసు చేయాలని సూచించింది. పట్టణ ప్రాంతాల్లో చెల్లిస్తున్న ఇంటి అద్దె అలవెన్స్‌ను పరిగణనలోకి తీసుకుని మారుమాల ప్రాంతాలు, ఏజె న్సీ ప్రాంతాలతో పాటు జిల్లాల విభజన తర్వాత ఇతర ప్రాంతాల్లో పని చేస్తున్న వారికి కూడా ప్రయోజనం కల్పించే విధంగా ప్రత్యేక అలవెన్స్‌ను కూడా కమిషన్ సిఫారసు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ప్రస్తుత ఎల్‌టిసి విధానాన్ని సమీక్షించి సవరణలతో కొత్త ఎల్‌టిసి విధానాన్ని సిఫారసు చేయాలని సూచించింది. అలాగే ప్రస్తుత పెన్షన్ విధానాన్ని సమీక్షించి సానుకూలమైన విధానాన్ని సిఫారసు చేయాలని పేర్కొంది.