తెలంగాణ

టీడీపీ నిర్వీర్యానికి కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ టౌన్, మే 18: తెలంగాణలో టీడీపీని కొంతమంది నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని, అయినా మినీమహానాడులు మాత్రం చెక్కు చెదరలేదని నిరూపిస్తున్నాయని తెలంగాణ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. శుక్రవారం మిర్యాలగూడలో జరిగిన నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి మినీ మహానాడులో ఆయన మాట్లాడుతూ నల్లగొండ మినీమహాడుకు వచ్చిన కార్యకర్తలను చూసి సీఎం కేసీఆర్ గుండెల్లో రైళ్లు పరుగెడ్తాయన్నారు. 2019 ఎన్నికల్లో అధికారంలోకి రావడం ఖాయమని, రైతుల కోసం ప్రత్యేకంగా బోనస్, గిట్టుబాటు ధర కల్పించేందుకు గాను 25,000 కోట్ల రూపాయలు కేటాయిస్తామన్నారు. రైతుబంధు పథకం బదులు రైతుకు గిట్టుబాటు ధర, బోనస్ ఇస్తే బాగుండేదన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తాగు, సాగు నీటికై కృషి చేస్తామని, నల్లగొండలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తామన్నారు. నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ స్థానాలు గెలిచేందుకు కార్యకర్తలు ఇప్పట్నుండే పని చేయాలన్నారు. వాజ్‌పాయి ప్రధానిగా ఉన్నప్పుడు కేంద్ర, రాష్ట్ర సంబంధాలు స్నేహపూర్వక వాతావరణంలో ఉండేవని, నేడు అలాంటి వాతావరణం కానరావడం లేదన్నారు. కర్నాటకలో మెజారిటి లేకున్నప్పటికి గవర్నర్ బీజేపీకి అవకాశం ఇవ్వడం అన్యాయం, అక్రమమన్నారు. రానున్న కాలంలో దేశ రాజకీయాల్లో టీడీపీ ప్రత్యేక పాత్ర పోషించనున్ననదన్నారు. సమావేశంలో పొలిట్‌బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాష్‌రెడ్డి, టీటీడీ సభ్యుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు ఎండీ.యూసుఫ్, పెద్దిరెడ్డి రాజా, సాధినేని శ్రీనివాస్‌రావులు పాల్గొన్నారు.

చిత్రం..సమావేశంలో మాట్లాడుతున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు రమణ