తెలంగాణ

కేంద్రీకృత పద్ధతిలో ఇంటర్ అడ్మిషన్లు నిర్వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 19: డిగ్రీ అడ్మిషన్ల మాదిరిగా కేంద్రీకృత పద్ధతిలో ప్రభుత్వమే ఇంటర్ మీడియట్ అడ్మిషన్లను నిర్వహించాలని జాతీయ బీసీ సంక్షే మ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. శనివారం బీసీ భవన్‌లో నిర్వహించిన బీసీ విద్యార్ధి రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి కృష్ణయ్య ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం ఎన్ని హెచ్చరికలు చేసినా కార్పోరేట్ కాలేజీలు విచ్చలవిడిగా అడ్మిషన్లు జరుపుకుంటున్నాయని అన్నారు. విద్యాను వ్యాపారంగా చేసి కార్పోరేట్ విద్యా సంస్థలు విద్యార్థుల తల్లిదండ్రులను దోచుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కార్పోరేట్ కాలేజీలు తెలంగాణ ప్రజలను దోచుకుంటున్నారని, రాష్ట్ర ఏర్పాటు అనంతరం కృష్ణానది అవతలకి తరిమి కొడతామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించి విస్మరించారని విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రాష్ట్ర ఏర్పాటు అనంతరం కార్పోరేట్ కాలేజీలు ఫీజులను రెండింతలు పెంచి మరీ వసూలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. ప్రభుత్వాలను శాసించే స్థాయి విద్యా సంస్థలు ఎదగడం శ్రేయస్కరం కాదని అన్నారు. ప్రజలకు విద్య, వైద్యం రాజ్యాంగ బద్దంగా ఉచితంగా ఇవ్వాల్సి బాధ్యత ప్రభుత్వంపై ఉందన్న విషయాన్ని మరిచి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పోరేట్ కాలేజీల బట్టీ చదువులతో విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురి అయి ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం స్పందించక పోవడంతో విచారకరమన్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్ అడ్మిషన్లు పారదర్శకంగా సాగేందుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.