తెలంగాణ

మెడిసిన్‌లో ఆర్మూర్ విద్యార్థికి 3వ ర్యాంకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్మూర్, మే 19: నిజామా బాద్ జిల్లా ఆర్మూర్ మండలం మంథని గ్రామానికి చెందిన సామల శ్రీ ఆర్యన్ మెడిసిన్‌లో 3వ ర్యాంకు సాధించారు. శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఎంసె ట్ ఫలితాలను విడుదల చేసిం ది. ఇందులో శ్రీ ఆర్యన్ మెడిసిన్ విభాగంలో 3వ ర్యాంకు సాధించాడు. 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఆర్మూర్‌లోని బ్రిలియంట్ హైస్కూల్‌లో, 9, 10వ తరగతులు ఆర్మూర్‌లోని జ్ఞాన్‌పీఠ్ హైస్కూల్‌లో చదివిన శ్రీ ఆర్యన్ ఇంటర్మీడియట్‌లో బీపీసీ తీసుకున్నాడు. మాదాపూర్‌లోని నారాయణ కళాశాలలో బైపీసీ చదివి 985 మార్కులు సాధించాడు. ఆ తర్వాత జరిగిన ఎంసెట్ పరీక్షలు రాసిన శ్రీ ఆర్యన్ మెడిసిన్ విభాగంలో రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంకు సాధించాడు. శ్రీ ఆర్యన్ తల్లిదండ్రులు సామల వినయ్‌కుమార్, స్వప్నలు ప్రస్తుతం ఆర్మూర్ మండలం పెర్కిట్‌లో నివాసం ఉంటున్నారు.

చిత్రం.. శ్రీ ఆర్యన్