తెలంగాణ

కేసీఆర్ విప్లవంతో కాంగ్రెస్ భస్మం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 19 తెలంగాణాలో కాంగ్రెస్‌కు రానున్న రోజుల్లో గడ్డురోజులని ఎంపి బాల్క సుమ న్ జోస్యం చెప్పారు. తెలంగాణా కాంగ్రెస్ నేతలు చెబుతున్నట్లుగా ఎక్కడా నిశబ్ధ విప్లవం లేదని, దేశ వ్యాప్తంగా కెసిఆర్ విప్లవం నడస్తున్నదని ఆయన కొనియాడారు. రైతు అభ్యున్నతికే ముఖ్యమంత్రి పని చేస్తున్నారని అందుకే తెలంగాణాలో పండుగు చేసుకుంటున్నారని చెప్పారు. శనివారం టిఆర్‌ఎస్ సిల్పీ కార్యలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతుబంధు పథకం అమలు తీరుపట్ల దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందన్నారు. తాము రైతులకు చేస్తున్న మేలును కాంగ్రెస్ ఓర్వలేక పోతోందన్నారు. తెలంగాణా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి తుపాకిరాయుడు మాట లు చెప్పుతున్నారని అవి కేవలం ఉత్తర ప్రగల్భాలని ఆయన కొట్టిపారేశారు. సాగునీటి ప్రాజెక్టుల పనులు శరవేగంగా జరుగుతున్నాయని త్వరలో లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. సిర్పూరు పేపర్ మిల్లును ప్రభుత్వం తిరిగి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. సింగరేణి కార్మికుల సమస్యలు దాదాపు పరిష్కారం అయ్యాయని చెప్పారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సింగిల్ డిజిట్ కూడా రాదని ఆయన ఎద్దేవ చేశారు.