తెలంగాణ

‘తెలంగాణ ఎక్స్‌లెన్స్ అవార్డు’ల వెల్లడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 19: 2018 సంవత్సరానికి సంబంధించి తెలంగాణ ఎక్సలెన్స్ అవార్డులను ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 15 విభాగాల్లో అవార్డుల కోసం ఐఏఎస్, ఇతర అధికారులను ఎంపిక చేసినట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ శైలేంద్ర కుమార్ జోషి తెలిపారు. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. సెర్చ్ కమిటీ చేసిన సిఫార్సుల మేరకు అవార్డులు ఇచ్చేందుకు అధికారులను ఎంపిక చేశామన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ ప్రిన్సిపాల్ రెసిడెంట్ కమిషనర్‌గా పనిచేస్తున్న జి. అశోక్ కుమార్, వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్ వి. అనిల్ కుమార్‌లకు వ్యక్తిగత ప్రతిభ ఆధారంగా అవార్డులకు ఎంపిక చేశారు. జనరల్ క్యాటగిరీలో వ్యక్తిగత అవార్డును నల్లగొండ కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్‌ను ఎంపిక చేశారు. ఆసుపత్రుల్లో అత్యధిక ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకున్న డాక్టర్ బుద్దప్రకాశ్ జ్యోతి, ఆదిలాబాద్ కలెక్టర్ డి. దివ్య, ఆదిలాబాద్ డీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజీవ్ రాజ్‌లను గ్రూప్ అవార్డుకు ఎంపిక చేశారు. జనరల్ క్యాటగిరీలో ఆర్గనైజేషన్ పరంగా జీహెచ్‌ఎంసీ కమిషనర్ డాక్టర్ బి. జనార్దన్‌రెడ్డి (డబల్ బెడ్‌రూంల కోసం స్థలాలను సేకరించినందుకు) ని తెలంగాణ ఎక్సలెన్సీ అవార్డుకు ఎంపిక చేశారు. ఇన్నోవేషన్ క్యాటగిరీలో మంచిర్యాల కలెక్టర్ ఆర్‌వి కర్ణన్‌ను (వికాసం స్కూల్ ప్రాజెక్టు చేపట్టినందుకు) వ్యక్తిగత అవార్డుకు ఎంపిక చేశారు. ఈ క్యాటగిరీలో ఆర్గనైజేషన్ పరంగా ఎం. దానకిషోర్‌ను ఎంపిక చేశారు. ఫ్లాగ్‌షిప్ పథకాల్లో కేసీఆర్ కిట్ అమలు చేయడంలో వ్యక్తిగత అవార్డుకోసం సూర్యాపేట కలెక్టర్ కే. సురేంద్రమోహన్ ఎంపికయ్యారు. ఇదే క్యాటగిరీలో గ్రూప్ విభాగంలో కరీంనగర్ కలెక్టర్ సర్ఫాజ్ అహ్మద్, డీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజేశం, ఎంసీహెచ్ కేంద్రం అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ మహమూద్ అలీం ఎంపికయ్యారు. ఈ క్యాటగిరీలో ఆర్గనైజేషన్ అవార్డుకు వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వాకాటి కరుణ ఎంపికయ్యారు. ల్యాండ్ రికార్డులను అప్‌గ్రేడేషన్‌కు సంబంధించి గ్రూప్ అవార్డుకు జగిత్యాల కలెక్టర్ డాక్టర్ ఏ. శరత్, జగిత్యాల ఆర్డీఓ గంటానరేందర్, మేడిపల్లి తహశీల్దార్ ఎన్. వెంకటేశం ఎంపికయ్యారు. ఇదే విభాగంలో ఆర్గనేజేషన్‌పరంగా నల్లగొండ రెవెన్యూ శాఖ ఎంపికైంది. కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ అవార్డును స్వీకరిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఐటీ వినియోగంలో పెద్దపల్లి కలెక్టర్ అలగు వర్షిని (ఇసుక పన్ను విధానంలో ఐటిని వినియోగించినందుకు) ఎంపికయ్యారు. గొర్రెల పంపిణీలో ప్రతిభ కనబరిచిన ఆర్గనైజేషన్ పరంగా కుమరంభీం ఆసిఫాబాద్ కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ ఆ జిల్లా పశుగణాభివృద్ధి శాఖ ఎంపికైంది. సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ఆర్గనైజేషన్ పరంగా రాజన్న సిర్సిల్లా జిల్లా కలెక్టర్ కృష్ణ్భాస్కర్, సిర్సిల్లా మున్సిపల్ కౌన్సిల్ ఎంపికైంది. ట్రోఫీని, సైటేషన్‌ను అందిస్తారు.