తెలంగాణ

రోగులను ఎక్కవ సమయం వేచి ఉంచొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 19: రోగులను ఎక్కువ సమయం వేచి ఉంచవద్దని టిఎస్‌ఆర్టీసి చైర్మన్ సోమారపు సత్యనారాయణ తార్నాక ఆర్టీసి హాస్పిటల్ అధికారులను ఆదేశించారు. మందులు అందుబాటులో ఉంచాలని, అవసరమైతే అదనపు కౌంటర్లు ప్రారంభించాలని చెప్పా రు. శనివారం చైర్మన్ సత్యనారాయణ హాస్పిటల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న రోగులు, హాస్పిటల్ సిబ్బందితో మాట్లాడారు. గతంలో తాను సం దర్శించినప్పుడు కొన్ని ఆదేశాలు జారీ చేశానని, వాటిని అమ లు చేశారా..? లేదా అని అధికారులను చైర్మన్ ప్రశ్నించారు. ఆర్టీసి పరిపాలన విభాగం ఈడి శివకుమార్, రెవెన్యూ ఈడి, సంస్థ కార్యదర్శి ఎంవి రావు, సిఎంఓ మమతా నారాయణ్‌తో చైర్మన్ సమావేశమై గతంలో తీసుకున్న నిర్ణయాలపై సమీక్షించారు. హాస్పిటల్ కార్యాలయ ఆవరణలో ఉన్న మెడ్‌ప్లస్ ఫార్మశీ సిబ్బందిన కూడా అవసరమైన మందులు అందుబాటులో ఉంచుతున్నదీ లేనిదీ అడిగి తెలుసుకున్నారు. రోగులు గంటల తరబడి వేచి ఉండకుండా కొన్ని సూచనలు సలహాలను అందించారు.

చిత్రం..తార్నాక ఆరీసీ హాస్పిటల్‌ను సందర్శించిన ఆర్టీసీ చైర్మన్ సోమారపు