తెలంగాణ

కంపుకొడుతున్న రాజకీయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, మే 19: దేశంలో నేడు జాతీయ రాజకీయాలన్నీ కుళ్లి కంపుకొడుతున్నాయని ఇలాంటి తరుణంలో ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ కోసం లౌకిక ప్రజాతంత్ర వామపక్ష శక్తులన్నీ ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్‌రెడ్డి అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ధర్మభిక్షం భవన్‌లో జరిగిన సీపీఐ జిల్లా సమితి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్రలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ వ్యవస్థని భ్రష్టుపటించారని ధ్వజమెత్తారు. అప్రజాస్వామిక విధానాలతో రాజ్యాంగ స్ఫూర్తిని మంటగలుపుతున్నారని మండిపడ్డారు. ఎన్నిలకు ముందు ఇచ్చిన హమీలను అమలు చేయడంలో మోదీ ప్రభుత్వ ఘోరంగా విఫలమయిందన్నారు. నల్లధనాన్ని వెలికితీత హమీలకే పరిమితమైందని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తుందని ఆరోపించారు. రాష్ట్రంలోనూ కేసీ ఆర్ ప్రభుత్వం నియంతృత్వ పోకడలను అవలంభిస్తూ ప్రజా ఉద్యమాలను అణగదొక్కుతుందని ఆరోపించారు. ఇచ్చిన హమీలను అమలు చేయకుండా మాయమాటలతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను మభ్యపెడుతూ కావం వెళ్ళదీస్తున్నారని విమర్శించారు. స్వామినాధన్ కమీషన్ సిపార్సులను కేంద్రం అమలు డిమాండ్ చేశారు. ఇటీవల అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తగిన పరిహరం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సీపీఐ రాష్ట్ర సహయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం నిరంకుశ విధానాలను అవలంభిస్తూ రాజ్యాంగం ద్వారా కల్పించిన హక్కులను హరిస్తుందని ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడే హక్కు రాజకీయపార్టీలకు, ప్రజాసంఘాలకు ఉంటుందన్నారు. ఈసమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, నాయకులు ప్రభాకర్, వెంకటేశ్వర్లు, బొమ్మగాని శ్రీనివాస్, బట్టు శివాజి, మేకల శ్రీనివాసరావు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.