తెలంగాణ

మళ్లీ తెరపైకి ప్రాణహిత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కౌటాల (ఆసిఫాబాద్), మే 28: తుమ్మిడి హెట్టి వద్ద ప్రాణహిత సంగమ స్థానంలో నిర్మించతలపెట్టిన తుమ్మిడిహెట్టి ప్రాణహిత సాగు నీటి ప్రాజెక్ట్ మళ్లీ తెరపైకి వచ్చింది. ఓ వైపు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో పాటు మరోవైపు ప్రతిపక్షాలు కూడా ప్రాణహిత ప్రాజెక్ట్ పై ప్రశ్నలు లెవనెత్తుతున్న వేళ.. మరోసారి ప్రభుత్వం విమర్శలు తిప్పి కొట్టేందుకు అడుగులు ముందకేస్తున్నట్లుగా తెలుస్తుంది. 2008 డిసెంబర్ 16 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కౌటాల మండలం తుమ్మిడిహెట్టిలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలంగాణ ప్రాంతంలో ఏడు జిల్లాల పరిధిలో 16 లక్షల 40 వేల ఎకరాలకు సాగు నీటి, హైదరాబాద్ - సికింద్రాబాద్ జంట నగరాలకు 20 టీఎంసీల కేటాయింపుతో అంకురార్పణ జరిగిన ప్రాజెక్ట్, మోబిలైజేషన్ అడ్వాన్స్‌లతో కొంతవరకు కాలువ నిర్మాణ పనులు మొదట్లో జరిగాయ. అనంతరం మారిన రాజకీయ, ఇతర పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన ప్రాజెక్ట్‌ల రీడిజైన్‌తో తుమ్మిడిహెట్టి ప్రాణహిత ప్రాజెక్ట్ ప్రస్తుత కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల పరిధిలోని ఐదు నియోజకవర్గాల్లో రెండు లక్షల ఎకరాలకు సాగు నీరందించే ప్రాజెక్ట్‌గా మారింది.
కాళేశ్వరం ప్రాణహితకు కొనసాగింపే...
ముఖ్యమంత్రి చేపట్టిన ప్రాజెక్ట్‌ల పునరాకృతి కార్యక్రమంలో భాగంగా తెరపైకి వచ్చిన కాళ్లేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్ట్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్ట్‌కు కొనసాగింపుగానే చేపడుతున్నారని చెప్పొచ్చు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అందించిన నివేదిక, లేఖ ప్రకారం తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్‌ను కొనసాగిస్తూ దానికి అనుసంధానంగా కొనసాగింపుగా కాళ్లేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నామని స్పష్టం చేసింది. అయితే, కాళ్లేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభం అయ్యే నాటి నుంచి తుమ్మిడిహెట్టి ప్రాణహిత ప్రాజెక్ట్ నిర్జీవంగా మారి కనీసం తట్టేడు మట్టి కూడా పక్కకు వేయని దుస్థితి నెలకొంది.
అటవీ శాఖకు 1533 హెక్టార్ల
రెవెన్యూ భూమి అప్పగింతకు సిద్ధం
ప్రాణహిత తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ ఉమ్మడి జిల్లాలో అంకుర్పారణ జరిగిన నేపథ్యంలో ప్రాణహిత ప్రాజెక్ట్ నిర్మాణంతో ముంపు ఇబ్బంది ఏర్పడుతున్న 1081 హెక్టార్లకు బదులుగా రెవెన్యూ శాఖకు సంబంధించిన భూమిని అటవీ శాఖకు బదలాయించేందుకు అధికార గణం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. 1980 అటవీ యాక్ట్ ప్రకారం అటవీ భూమి కోల్పోతే ఒక్కటిన్నర రెట్లు రెవెన్యూ భూమిని కేటాయిస్తూ దానిని అభివృద్ధి పరిచేందుకు నిధులు కూడా కేటాయించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ మేరకు 1082 ఎకరాలకు బదులుగా నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల పరిధిలోని పలు చోట్ల 1533 హెక్టార్ల భూమిని రెవెన్యూ శాఖ సిద్ధణ చేసి అటవీ శాఖకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. భూమికి బదులు భూమిని కేటాయించేందుకు రెవెన్యూ శాఖ తరుపున ఆదిలాబాద్ జిల్లాతోపాటు నిర్మల్ జిల్లాలో మండి, ఆరేపల్లి, రాయ్‌పల్లి, మన్నూర్, బూసి, మహాలింగి, దిలావర్‌పూర్, శివారులలో అటవీ శాఖకు రెవెన్యూ శాఖ ద్వారా భూమిని సమకూర్చేందుకు అన్ని విధాల నివేదికలు సిద్ధం అయినట్లు తెలుస్తోంది.
జూన్ 2వ వారంలో ఇరు రాష్ట్రాల
ఉన్నత స్థాయి సమావేశం
ప్రాణహిత తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్‌కు సంబంధించి భవిష్యత్ కార్యచరణ రూపొందించేందుకు తెలంగాణ మహారాష్ట్ర అంతరాష్ట్ర ఉన్నత స్థాయి సమావేశం వచ్చే జూన్ నెల మొదటి వారంలో మహారాష్టల్రోని చంద్రపూర్‌లో నిర్వహించనున్నట్లుగా సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించి ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు ఉత్తరప్రత్యుత్తరాలు, సంప్రదింపులు చేసినట్లుగా తెలుస్తోంది.