తెలంగాణ

పారిశ్రామిక పార్కుల నిర్మాణాన్ని వేగవంతం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 29: రాష్ట్రంలోని వివిధ పాంతాల్లో నిర్మిస్తున్న పారిశ్రామిక పార్కులను వేగవంతంగా ని ర్మించి అందుబాటులోకి తేవాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం టీఎస్‌ఐఐసీ చేపడుతున్న ప్రాజెక్టులపై మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. నగరంతో పాటు జిల్లాలో ఏర్పాటు చేస్తున్న పారిశ్రామిక పార్కుల నిర్మాణ పనుల పురోగతిని ఆయన తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు దండు మల్కాపూర్‌లో ఏర్పాటు చేయనున్న ఎంఎస్‌ఎంఈ పార్కు దాదాపుగా ప్రారంభానికి సిద్దంగా ఉన్నట్టు అధికారులు మంత్రి కి తెలిపారు. బండమైలారంలోని సీడ్ పార్కు, ఫుడ్ ప్రాసెసింగ్ పార్కు, శివనరగ్‌లోని ఎల్‌ఈడి పార్కు పనులు వేగవంగా కొనసాగుతున్నాయని అధికారులు మంత్రికి వివరించారు. సిరిసిల్లలో ఏర్పాటు చేయనున్న అప్పారెట్ పార్కు పనులు ఏ మేరకు పూర్తి చేశారని మంత్రి ఆరా తీశారు. రాష్ట్రంలోని అన్ని పార్కుల వివరాలు, వాటిలోకి వచ్చిన, రానున్న పెట్టుబడుల మొత్తం, ఉద్యోగ అవకాశాల వివరాలతో ఒక సమగ్రమైన నివేదిక తయారు చేయాలని మంత్రి అధికారులను కోరారు. దుర్గం చెరువు సుందరీకరణ పూర్తి కావస్తున్నట్టు టివర్క్ పనులు త్వరలో శంకుస్థాపనకు రెడీగా ఉన్నాయని చెప్పారు. జీ ఓ 20 ప్రకారం కాలుష్యకారక పరిశ్రమలను నగరం అవతలకు తరలించే కార్యక్రమంలో భాగంగా సనత్‌నగర్, నాచారం, కాటేదాన్ మొదలయిన ప్రాంతాల్లోని పరిశ్రమలతో సమావేశం కావాలని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్, టీఎస్‌ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి పాల్గొన్నారు.

చిత్రం..అధికారులతో సమీక్షలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్