తెలంగాణ

దక్షిణాసియాలోనే పెద్ద ప్రాజెక్టు పాలమూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, మే 29: దక్షిణాసియా ఖండంలోనే పాలమూరు ప్రాజెక్టు అతిపెద్ద ప్రాజెక్టు అని.. ఇలాంటి ప్రాజెక్టును వెనుకబడిన పాలమూరు జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మిస్తుండడం ఇక్కడి ప్రజలు అదృష్టంగా భావిస్తున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం మూసాపేట మండల పరిధిలోని తిమ్మాపూర్, సంకల్‌మద్ది, తుంకినిపూర్, అడ్డాకుల మండలం తిమ్మాయపల్లి గ్రామాల్లో రూ. 5కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన బీటీరోడ్ల నిర్మాణానికి మంత్రి జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా తిమ్మాపూర్ గ్రామంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ త్వరలోనే గ్రామపంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయని అందుకు ప్రజలతో పాటు టీఆర్‌ఎస్ శ్రేణులంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. దేశంలోనే అభివృద్ధిలో అగ్రగామిలో తెలంగాణ రాష్ట్రాన్ని నిలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రజలంతా అండగా ఉండి పంచాయతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థులందరినీ ముకుమ్మడిగా గెలిపించాలని ఆయన కోరారు. గ్రామపంచాయతీ వ్యవస్థను పటిష్ట పర్చిందుకు కొత్త చట్టాలను తీసుకువచ్చామని గ్రామపంచాయతీ పాలక మండలి అభివృద్ధి చేయకపోతే ఆ పంచాయతీ మండలిని రద్దు చేయడానికి కూడా చట్టంలో పొందుపర్చామని అదేవిధంగా గ్రామాలు పరిశుభ్రంగా ఉండడానికి ఇంట్లో ఉన్న చెత్తను రోడ్లపై వేసినట్లు అయితే రూ. 500 జరిమానా కూడా విధించే విధంగా చట్టాల్లో రూపొందించడం జరిగిందన్నారు. 100 శాతం మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు నిర్మించుకున్న గ్రామాలకే భవిష్యత్తులో నిధులు వచ్చే అవకాశాలు ఉంటాయని ఈ విషయాన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలు కూడా గుర్తించుకోవాలని హితవు పలికారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రధానమంత్రి మోదీతో పాటు కాంగ్రెస్ అధినాయకురాలు సోనియాగాంధీ కూడా ప్రసంశలు కురిపిస్తున్నారని కాంగ్రెస్, బీజేపీ పాలిట రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తెలంగాణ అభివృద్ధిపై హితబోధ చేస్తున్నారన్నారు. 2019 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 100 సీట్లకు తగ్గకుండా ప్రజలు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారని మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని పాలించబోతున్నారన్నారు.
కేసీఆర్ రాజకీయంగా కచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని ప్రతిపక్షాలకు రాష్ట్రంలో స్థానం లేకుండా చేశారన్నారు. ఇంకా గ్రామాల్లో కాంగ్రెస్, టీడీపీ జెండాలు ఉంటే దుర్మార్గమైన చర్య అని అమానుషమని ఆ జెండాల కిందికి ప్రజలు వెళ్లకూడదని పిలుపునిచ్చారు. వచ్చే ఆగస్టు 15 నుండి రైతులకు మరో వరం రాబోతుందని రూ. 5లక్షల బీమా పథకానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టబోతున్నారన్నారు. రైతుబంధు, బీమా పథకంతో కాంగ్రెస్ ఇతర పార్టీల అరికాళ్ల కింద భూమి కదిలిపోయిందని ఇక వారికి భూకంపం కేసీఆర్ సృష్టించారని ఎద్దేవా చేశారు. ప్రజలంతా ఒకవైపు ఉంటే కాంగ్రెస్ నాయకులు ఒకవైపు ఉన్నారని వారికి ఓట్లు రావని కేవలం నాయకులు మాత్రమే ఓట్లు వేసుకుని ఇంట్లో పడుకునే రోజులు దగ్గర పడ్డాయని ఘాటైన విమర్శలు చేశారు. అన్నం ఉడికిందా లేదా అనే విషయాన్ని ఒక్క మేతుకు పట్టిచూస్తే తెలిసిపోతుందని అందుకే కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాల్లో ప్రతి పథకం ఒక్క మేతుకుతో సమానమని ఆయన అన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా రెండేళ్లలో మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించి తీరుతామని ఇప్పటికే నీరు వచ్చేదని కానీ కాంగ్రెస్ నాయకులు దుర్మర్గంగా ముందుకెళ్లి కేసులు వెయడంతో ఆలస్యమైందని అలాంటి నాయకులు గ్రామాలకు వస్తే రైతులు నిలదీయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ పాల్గొన్నారు.

చిత్రం..ఘతిమ్మాపూర్ గ్రామంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి జూపల్లి కృష్ణారావు