తెలంగాణ

బీమాతో రైతుకు ధీమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామారెడ్డి, మే 29: రైతుకు బీమా సౌకర్యాన్ని కల్పించిన సీఎం కేసీఆర్.. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా రైతుల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. పంట నష్టం విషయంలో రైతుకు భరోసా ఉంటుందని అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని రెడ్డిపేట్ గ్రామంలో రైతుబంధు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. రెవెన్యూ శాఖ భూ ప్రక్షాళనలో నిర్వహించిన పనితీరుపై మంత్రి ఆసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 10 వేల 800 రెవెన్యూ గ్రామాల ఉన్నాయి. సుమారు 100 రోజులు భూ ప్రక్షాళన కార్యక్రమంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యులు చేసి సంపూర్ణంగా ప్రక్షాళన విజయవంతం చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాల ఉన్నప్పటికీ రెవెన్యూ సిబ్బంది పనితీరుపై నిప్పులు చెరిగారు. రెవెన్యూ సిబ్బంది చేసే ఆలసత్వం వల్ల కొందరు రైతులకు ఇబ్బందిగా మారిందన్నారు. ఇటీవల రైతులకు అందజేసిన నూతన పాసుపుస్తకాలు, చెక్కులు అందని రైతులు దిగులు చెందవద్దని భరోసా ఇచ్చారు. పాసుపుస్తకాల్లో తప్పులు, పేర్ల నమోదులో జరిగిన పొరపాట్లను సరిచేసి రెండో విడుతల్లో భాగంగా రైతులందరికీ చెక్కులు, నూతన పట్టాపాసుపుస్తకాలను అందజేస్తామన్నారు. రైతుల కోసం ముఖ్యమంత్రి పంటల బీమా పథకం కింద 5 లక్షల ఎక్స్‌గ్రేషియాను ఆమలు చేస్తున్నారని.. వాటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గంప గోవర్దన్, ఆర్డీవో శ్రీను, జిల్లా వ్యవసాయ శాఖ ఆధికారి నాగేంద్రయ్య పాల్గొన్నారు.